ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమస్యలపై పోరాటానికి సిద్ధం కండి : కురుగొండ్ల

ABN, First Publish Date - 2021-08-04T03:43:32+05:30

: గ్రామస్థాయిలో సమస్యలపై పోరాటానికి సిద్ధం కావాలని టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన నివాసంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గస్థాయి సమ

సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 

వెంకటగిరి, ఆగస్టు 3: గ్రామస్థాయిలో సమస్యలపై పోరాటానికి సిద్ధం కావాలని టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన నివాసంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గస్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏమండలానికి ఆ మండలంలో సమావేశాలు నిర్వహించి, అక్కడి సమస్యలపై చర్చించి వాటిని కలెక్టర్‌, ఎస్పీల దృష్టికి తీసుకుపోనున్నట్లు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఒక్క అభివృద్ధి జరగక పోగా, ఉన్న పరిశ్రమలు సైతం పక్క రాష్ట్రాలకు తరలి వెళుతున్నాయని ఆరోపించారు. చేసిన పనులకు కూడా బిల్లులు చెల్లించక పోవడంతో పలువురు అవస్థలు పడుతున్నట్లు  తెలిపారు. చేసిన పనపులకు బిల్లులు చెల్లించేవరకు పోరాడుతామని స్పష్టం చేశారు.  కార్యక్రమంలో నాయకులు పోలంరెడ్డి వెంకటరెడ్డి, పులికొల్లు రాజేశ్వరావు, శ్రీరామదాసు గంగాదరం, కేవీకే ప్రసాద్‌ నాయుడు, మోహన్‌కృష్ణారెడ్డి,  తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-08-04T03:43:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising