ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా సంక్రాంతి, కనుమ

ABN, First Publish Date - 2021-01-16T05:12:12+05:30

పట్టణాలు, గ్రామాల్లో గురు, శుక్రవారాల్లో సంక్రాంతి, కనుమ పండుగను ఘనంగా నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫోటో : 15 ఎస్‌పేట 1 : గోదాదేవి కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు

సూళ్లూరుపేట, జనవరి 15 :    పట్టణాలు, గ్రామాల్లో గురు, శుక్రవారాల్లో సంక్రాంతి, కనుమ పండుగను ఘనంగా నిర్వహించారు. స్థానిక బాలాంజనేయస్వామి ఆలయంలో  ప్ర ధాన అర్చకులు దీవీ లక్ష్మీనారాయణ గోదాదేవి కల్యాణాన్ని వైభవంగా జరిపిం చారు.  గాజురెడ్డి సుధాకర్‌రెడ్డి దంప తులు ఉభయకర్తలుగా వ్యవహ రించారు. తమ స్వగృహం నుంచి ఊరేగింపుగా సారెను తీసువచ్చి సమర్పించారు.  సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయంలో పెద్ద ఎ త్తున గోపూజను నిర్వహించారు.  సూళ్లూరుపేట షార్‌ బస్టాండ్‌లోని వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద గురువారం రాత్రి శ్రీదేవి, భూదేవీలతో శ్రీవారిని అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. 

మకరజ్యోతి వేడుకలు 

సూళ్లూరుపేట అయ్యప్పస్వామి ఆలయం ఆవరణలోగురువారం రాత్రి ఏర్పాటు చేసిన భారీ క్రేన్‌కు అమర్చిన పెద్ద తొట్టెలో భక్తుడు వేనాటి రామచంద్రారెడ్డి పెద్ద ఎత్తున కర్పూరం పెట్టారు. అనంతరం విద్యుత్‌ సరఫరాను నిలిపివేసి రిమోట్‌ సాయంతో  కర్పూరాన్ని వెలిగించారు.  కర్పూరజ్యోతి వెలుగులు విరజిమ్మింది. భక్తులు శరణ ఘోషలతో ఆ ప్రాంతం మారుమోగింది. 

నాయుడుపేట టౌన్‌ : కనుమ సందర్భంగా గ్రామాల్లో ప్రతి ఇంటా దొడ్డెను ఏర్పాటు చేసి నల్లేరు, తంగేడు ఆకును పెట్టి ప్రతి గేదెకు, ఆవుకు బొట్లుపెట్టి పూలమాలలు వేసి పొంగళ్లు పొంగించి ప్రత్యేక పూజలు చేశారు. 

గూడూరు(రూరల్‌) : స్థానిక ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో   ప్రధాన అర్చకులు వాచస్పతి గోమాతకు పూజలు నిర్వహించారు.  చిల్లకూరు మండలంలోని తూర్పుకనుపూరు ము త్యాలమ్మ ఆలయంలో, ఏరూరు చెన్నకేశవస్వామి, శ్రీకాళహసీ ్తశ్వరస్వామి ఆలయాల్లో వరగలి కోదండరామస్వామి ఆలయంలో గోపూజ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహి ంచారు.

వాకాడు :  శుక్రవారం స్వయంభు శ్రీ వల్లిదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణేశ్వరస్వామిని  తిరుమూరులో ప్రజలు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. స్వామి ప్రత్యేక వాహనం ద్వారా 16 గ్రామాలు పర్యటించారు. మండలంలోని శివాలయం వద్ద గురువారం రాత్రి భక్తులు మకర జ్యోతి వేడుకలను నిర్వహించారు. 

డక్కిలి : గురువారం స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి  వచ్చిన భక్తులకు ఆలయ నిర్వాహకులు అన్నదానం నిర్వహించారు. 

రాపూరు: కనుమను పురస్కంచుకుని పోతుకొండ అంకమ్మతల్లి ఆలయంలో భక్తులు పొంగళ్లు పెట్టి నైవేద్యం సమర్పించారు. పట్టణంతోపాటు గ్రామాల్లో నెల పాటు గొబ్బిపాటలు పాడి సందడి చేసిన యువతులు  శుక్రవారం కలసి పాటలు పాడుకుంటూ డప్పులు వాయిద్యాలతో కలసి వెళ్లి పుట్టిమట్టి తీసుకువచ్చి కుమ్మర ఇంట అందించారు. కుమ్మరులు గొబ్బెమ్మను తయారు చేయడంలో నిమగ్నమయ్యారు. గ్రామాల్లో గోమాతలకు  ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. సంక్రాంతిని పురస్కరించుకుని గోనుపల్లిలో పెంచలస్వామిని  ప్రత్యేకంగా అలంకరించి  ఆస్థానసేవ నిర్వహి ంచారు.  పెనుబర్తిలో చెన్నకేశవస్వామి కల్యాణాన్ని కనుల పండువగా నిర్వహించారు. కోనలో  గోమాతలకు పూజలు చేశారు.  

పెళ్లకూరు : మండలంలోని శిరసనంబేడు, రోసనూరు గ్రామాల్లో సిద్దేశ్వరస్వామి భూపతేశ్వరస్వాముల తిరునాళ్లు శుక్రవారం వైభవం గా జరిగాయి. శిరసనంబేడులో  సిద్దేశ్వరస్వామి, రోసనూరులో భూపతేశ్వరస్వామి ఉత్సవాలను నిర్వహించారు.


Updated Date - 2021-01-16T05:12:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising