ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్లాస్టిక్‌ వినియోగాన్ని అరికట్టేందుకు చర్యలు

ABN, First Publish Date - 2021-03-03T05:06:25+05:30

ప్లాస్టిక్‌ వినియోగాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎంపీడీవో ప్రత్యూష పేర్కొన్నారు.

ప్లాస్టిక్‌ నివారణకు మైక్‌లో ప్రచారం చేస్తున్న ఎంపీడీవో ప్రత్యూష
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముత్తుకూరు, మార్చి 2: ప్లాస్టిక్‌ వినియోగాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎంపీడీవో ప్రత్యూష పేర్కొన్నారు. ముత్తుకూరులో మంగళవారం ప్లాస్టిక్‌ నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అందరూ సహకరిస్తేనే ప్లాస్టిక్‌ నిర్మూలన సాఽధ్యమన్నారు. ఇప్పటికే పలుమార్లు దుకాణ యజమానులను ప్లాస్టిక్‌ కవర్లు వినియోగించవద్దని హెచ్చరించామన్నారు. ప్లాస్టిక్‌ వ్యర్థాల కారణంగా పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందన్నారు. వీధుల్లో పేరుకుపోతున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలు తిని పశువులు మృతి చెందుతున్నాయన్నారు.  దుకాణాల్లో ప్లాస్టిక్‌ వాడకాన్ని నిషేధిస్తూ యజమానులకు నోటీసులు జారీ చేశామన్నారు. పంచాయతీ కార్యదర్శులు ప్లాస్టిక్‌ నిషేధాన్ని పర్యవేక్షించాలన్నారు. నిబంధనలను అతిక్రమించి ప్లాస్టిక్‌ను వినియోగిస్తే అపరాధ రుసుం విధించాలని ఆదేశించారు. ప్రజలు సైతం ప్లాస్టిక్‌ కవర్ల స్థానంలో జనపనార, గుడ్డ సంచులు, బుట్టలు వినియోగించడం అలవాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఈవో చక్రం వెంకటేశ్వర్లు, వలంటీర్లు పాల్గొన్నారు.  

Updated Date - 2021-03-03T05:06:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising