ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెన్నానదిలో గుర్తు తెలియని మృతదేహం

ABN, First Publish Date - 2021-12-31T03:38:32+05:30

మండలంలోని కుడితిపాలెం పెన్నానది ఒడ్డున గుర్తు తెలియని మృతదేహాన్ని గురువారం పోలీసులు గుర్తించారు. ఒడ్డున పురు

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇందుకూరుపేట, డిసెంబరు 30 :  మండలంలోని కుడితిపాలెం పెన్నానది ఒడ్డున గుర్తు తెలియని మృతదేహాన్ని గురువారం పోలీసులు గుర్తించారు. ఒడ్డున  పురుషుడి శవం ఉండడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఎవరైనా తెచ్చి వేసారా.. లేక హత్య చేశారా? అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. మూడు రోజుల నుంచి మృతదేహం పడి ఉన్నా, వీఆర్‌వో రాఘవరెడ్డికు గ్రామస్థులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు తెలిపారు. కనీసం పోలీసులకు, రెవెన్యూ అధికారులకు కూడా ఫిర్యాదు చేయలేదని వారు చెబుతున్నారు. వీఆర్‌ఏ మొలకయ్య గురువారం ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ ఆనంద్‌ తక్షణం స్పందించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని నెల్లూరులోని మార్చురీకి తరలించారు.  నదిలో ప్రవాహం లేనందున కొట్టుకురావడం జరగదని,  హత్య అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-12-31T03:38:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising