ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీడిత ప్రజల ఆశాజ్యోతి ‘పెరియర్‌’

ABN, First Publish Date - 2021-09-18T03:23:52+05:30

పీడిత ప్రజల ఆశాజ్యోతిగా పెరియర్‌ రామస్వామి నాయర్‌ గుర్తింపు పొందారని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు జానకి ప్రసాద్‌ పేర్కొన్నారు.

పెరియర్‌ రామస్వామి జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ప్రతినిధులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు జానకి ప్రసాద్‌


తోటపల్లిగూడూరు, సెప్టెంబరు 17 : పీడిత ప్రజల ఆశాజ్యోతిగా పెరియర్‌ రామస్వామి నాయర్‌ గుర్తింపు పొందారని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు జానకి ప్రసాద్‌ పేర్కొన్నారు. శుక్రవారం   మండలంలోని చిన్నచెరుకూరులో పెరియర్‌ రామస్వామినాయర్‌ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సర్పంచ్‌ ఉయ్యాల భాస్కర్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, మాట్లాడుతూ గాంధేయవాదిగా, కాంగ్రెస్‌ కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన పెరియర్‌ మద్యపాన నిషేదం, అంటరానితనం నిర్మూలన వంటి గాంధీ విధానాల పట్ల ఆకర్షితులయ్యారని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఎస్పీ సర్వేపల్లి నియోజకవర్గ ప్రెసిడెంట్‌ ఎం.సుధాకర్‌, యు.సుధాకర్‌, పి.మస్తానయ్య, కె.రవీంద్రకుమార్‌, ఎన్‌.సతీష్‌, చెంగల్రావు, తదితరులు పాల్గొన్నారు.   

కోవూరు  : పట్టణంలోని ఎన్జీవో హోంలో శుక్రవారం పెరియార్‌ రామస్వామి నాయకర్‌ 142వ జయంతిని పురస్కరించుకుని బీఎస్పీ నాయకులు ఘన నివాళ్లులర్పించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా ఆర్గనైజింగ్‌ కార్యదర్శి కడింపాటి అశోక్‌ మాట్లాడుతూ ఇంటింటికీ బీఎస్పీని తీసుకువెళ్లేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. పెరియార్‌ ఆశయాలను నెరవేర్చేందుకు బహుజనులందరూ ఒక్కతాటిపైకి రావాలన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌ విగ్రహం నుంచి ఎన్జీవో హోం వరకు ప్రదర్శన చేసి గోడపత్రికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు కడింపాటి అనిల్‌, గాలి రాజా, ముదివర్తి కృష్ణమూర్తి, సర్వేపల్లి సద్వీన్‌ కుమార్‌, దాసు, శివ, మోచర్ల రాహుల్‌ తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-09-18T03:23:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising