ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాతస్నేహితులను కలిపే వేదికగా క్రికెట్‌ టోర్నమెంట్‌

ABN, First Publish Date - 2021-03-07T04:20:25+05:30

పాతస్నేహితులందరిని కలిపే వేదికగా సీనియర్స్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ నిలుస్తుందని మత్స్యశాఖ ఏడీ చాంద్‌బాషా, ఈవో కోవూరు జనార్దన్‌రెడ్డి అన్నారు.

క్రికెట్‌పోటీలను ప్రారంభిస్తున్న మత్స్యశాఖ ఏడీ చాంద్‌బాషా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిల్లకూరు, మార్చి 6:  పాతస్నేహితులందరిని కలిపే వేదికగా సీనియర్స్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ నిలుస్తుందని మత్స్యశాఖ ఏడీ చాంద్‌బాషా, ఈవో కోవూరు జనార్దన్‌రెడ్డి అన్నారు. శనివారం  కలువకొండ గ్రామంలోని లక్ష్మీ నరసింహస్వామి క్రీడామైదానంలో సీనియర్స్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ మండలంలోని సీనియర్‌ క్రికెటర్లందరు కలిసి 12 ఏళ్లుగా ఈ టోర్నమెంట్‌ను నిర్వహించడమే కాకుండా, కొంత నిధిని ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మధు, రఘు, మోహన్‌, చేవూరు నాగరాజు, సన్నారెడ్డి సురేష్‌రెడ్డి, సుబ్రమణ్యం, మునిశేఖర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. ఉదయం అక్వాలెవెన్స్‌- సిలికాలెవెన్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. మొదట బ్యాంటింగ్‌ చేసిన ఆక్వాలెవెన్స్‌ నిర్ణీత 12 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన సిలికా లెవెన్స్‌ 11.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసి విజయం సాధించింది. మధ్యాహ్నం కోస్టల్‌ లెవెన్స్‌ - గ్రావెల్స్‌ లెవెన్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. మొదట బ్యాటింగ్‌ చేసిన కోస్టల్‌ లెవెన్స్‌ జట్టు నిర్ణీత 14 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన గ్రావెల్‌ లెవెన్స్‌ 14 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసి ఓటమిపాలైంది.

Updated Date - 2021-03-07T04:20:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising