ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పార్టీ అధికారంలోకి రాబోతుంది.. ధైర్యంగా ఉండండి: చంద్రబాబు

ABN, First Publish Date - 2021-04-11T04:08:01+05:30

తమ్ముళ్లూ.. ధైర్యంగా ఉండండి.. పార్టీ అధికారంలోకి రాబోతుంది అంటూ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు.

చంద్రబాబును గజమాలతో సత్కరిస్తున్న నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీలో చేరిన వారితో చంద్రబాబునాయుడు

నెల్లూరు (వైద్యం)ఏప్రిల్‌ 10 : తమ్ముళ్లూ.. ధైర్యంగా ఉండండి.. పార్టీ అధికారంలోకి రాబోతుంది అంటూ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. శనివారం నెల్లూరు అనిల్‌గార్డ్‌న్స్‌లో కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి నాయకత్వంలో 4,53 డివిజన్లకు చెందిన వైసీపీ కార్యకర్తలు, నాయకులు చంద్రబాబు సమక్షంలో  టీడీపీలో  అధిక సంఖ్యలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు వారందరికీ కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన నేతలను చంద్రబాబుకు కోటంరెడ్డి పరిచయం చేశారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ కష్టకాలంలో పార్టీ కోసం అందరూ కలిసి కట్టుగా పనిచేయాలన్నారు. వైసీపీ అరాచకాలకు ఎదురొడ్డి పోరాడిన వారికి పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి నాయకత్వంలో నెల్లూరు సిటీలో పార్టీని బలోపేతం చేయాలని సూచించారు కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్‌ మామిడాల మధు చంద్రబాబును గజమాలతో సత్కరించారు. 

అజీజ్‌ ఆధ్వర్యంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిక

నెల్లూరు (వైద్యం)ఏప్రిల్‌ 10 : టీడీపీ నెల్లూరు పార్లమెంట్‌ అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌ ఆధ్వర్యంలో వైసీపీకి చెందిన పలువురు టీడీపీలో చేరారు. శనివారం 17వ డివిజన్‌కు చెందిన  వైసీపీ నాయకులు ఊటుకూరు దత్తాత్రేయ కుటుంబ సభ్యులు, అనుచరులు బైక్‌ర్యాలీ చేపట్టి టీడీపీ జిల్లా కార్యాలయానికి చేరుకున్నారు. అలాగే మాజీ కార్పొరేటర్లు, వైసీపీ నేతలు, న్యాయవాదులు, టీచర్స్‌ సంఘాల నేతలు, మేధావి వర్గాలు, విద్యార్థులు అధిక సంఖ్యంలో చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా అజీజ్‌ మాట్లాడుతూ వైసీపీ పాలన ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా పలువురు టీడీపీలో చేరారనన్నారు.  కార్యక్రమంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడి,్డ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి  పాల్గొన్నారు.





Updated Date - 2021-04-11T04:08:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising