ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

4 లక్షల టన్నుల లక్ష్యం.. ఆ తర్వాత ఎంతైనా!

ABN, First Publish Date - 2021-02-24T04:56:54+05:30

ఈ రబీ సీజన్‌లో 4 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించేందుకు పౌర సరఫరాల శాఖ అధికారులు లక్ష్యంగా నిర్ధేశించుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధాన్యం సేకరకు సివిల్‌ సప్లయీస్‌ లక్ష్యం

16.43 లక్షల టన్నుల దిగుబడి అంచనా

214 ధాన్యం సేకరణ కేంద్రాల ఏర్పాటు

రైతుల వస్తే ప్రతి గింజా కొనుగోలు చేస్తామంటున్న అధికారులు


నెల్లూరు (హరనాథపురం), ఫిబ్రవరి 23 : ఈ రబీ సీజన్‌లో 4 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించేందుకు పౌర సరఫరాల శాఖ అధికారులు లక్ష్యంగా నిర్ధేశించుకున్నారు. అంతకు మించి ధాన్యం అమ్మడానికి రైతులు వచ్చినా ప్రతి గింజా కొనుగోలు చేయనున్నారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా 75 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా, వీటిలో 71 మిల్లులను ట్యాగ్‌ఆన్‌ చేశారు. నాయుడుపేట, గూడూరు, కావలి, ఆత్మకూరు, ఏఎ్‌సపేట, దొరవారిసత్రం, కోట, సంగం, పెళ్లకూరు, ఓజిలి తదితర ప్రాంతాలలో కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభమవగా, జూన్‌ వరకు కూడా ధాన్యం సేకరించనున్నారు. కాగా, ఇప్పటివరకు రూ. 4.65 కోట్ల విలువైన 2,961 టన్నుల ధాన్యం సేకరించారు. కాగా, ఈ సీజన్‌లో 16.43 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.


గత ఎడగారులో..


గత ఎడగారు సీజన్‌లో ఎన్నడూ లేనివిధంగా 3.08 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖ సేకరించింది. 13,829 మంది రైతుల నుంచి రూ.564 కోట్ల విలువైన ధాన్యాన్ని సేకరించడమేగాక ఆ  మొత్తాన్ని చెల్లించి ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారు. ధాన్యం సేకరణ కోసం ఆ శాఖ డీఎం రోజ్‌మాండ్‌ గోదాములు, పీపీసీ కేంద్రాల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటుతోపాటు తన కార్యాలయంలో సెంట్రల్‌ కంప్యూటరింగ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేసి రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ చేయించి, రైతులకు చెల్లింపులు పూర్తి చేశారు. 



పెరిగిన మద్దతు ధర


ఈసారి గ్రేడ్‌-ఏ, సాధారణ ధాన్యం రకాలకు మద్దతు ధర పెరిగింది. గ్రేడ్‌-ఏ రకం ధాన్యం టన్ను గతేడాది రూ.18,350 ఉండగా ప్రస్తుతం రూ.18,880లకు (రూ.530 పెంపు) పెరిగింది. సాధారణ రకం కూడా గతేడాది టన్ను రూ.18150 ఉండగా, ప్రస్తుతం రూ.18680కి (పెంపు రూ.530) పెరిగింది. ఈ సీజన్‌లో అత్యధికంగా దిగుబడి రావడంతో రైతులకు ఇబ్బంది లేకుండా పొలం వద్దకే వెళ్లి ధాన్యం కొనుగోలు చేయనున్నారు. పౌరసరఫరాల శాఖ వద్ద 5లక్షల గోతాలు ఉండగా, మరో 34 లక్షల గోతాలను తెప్పించారు. 


సిద్ధంగా గోదాములు


జిల్లాలో స్టేట్‌ వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్‌ గోదాములు, సెంట్రల్‌ వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ గోదాములు, సివిల్‌ సప్లయీస్‌ గోదాములు ఉన్నాయి. ఈ గోదాముల్లో 2.64 లక్షల టన్నుల ధాన్యం నిల్వ చేసుకొనే సామర్థ్యం ఉంది. ప్రస్తుతం 1.34 టన్నుల ధాన్యం, బియ్యం నిల్వలు ఉన్నాయి. వీటిని జిల్లాలో వాడుకకు, ఇతర జిల్లాలకు పంపడం వల్ల ఏ రోజుకారోజు నిల్వలు తగ్గుతాయి. కొత్తగా కొనుగోలు చేసే ధాన్యాన్ని వాటిలో నిల్వ చేసే ఏర్పాట్లు చేస్తున్నారు. 



దళారులతో మోసపోకండి!


ఈ  సీజన్‌లో ధాన్యం కొనుగోలు చేయడానికి కొనుగోలు కేంద్రాలను ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేస్తున్నాం. దళారుల వల్ల మోసపోకుండా మద్దతు ధరకు ధాన్యం అమ్ముకోవాలి. కొనుగోలు కేంద్రాలలో ఏమైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకొని వస్తే తక్షణం పరిష్కరిస్తాం.

- కేఎం రోజ్‌మాండ్‌, సివిల్‌ సప్లయీస్‌, జిల్లా మేనేజర్‌  

Updated Date - 2021-02-24T04:56:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising