ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిశ్రమల నుంచే ఆక్సిజన్‌ సేకరణ

ABN, First Publish Date - 2021-05-07T04:33:15+05:30

కరోనా బాధితుల కోసం జిల్లాలోని పరిశ్రమల నుంచి ఆక్సిజన్‌ సేకరించనున్నట్లు కలెక్టర్‌ చక్రధర్‌బాబు వెల్లడించారు.

ఆక్సిజన్‌ పరికరాలను పరిశీలిస్తున్న కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ చక్రధర్‌బాబు

ఆక్సిజన్‌ పరికరాలు అందజేసిన డీఆర్‌డీవో చైర్మన్‌ సతీష్‌రెడ్డి


నెల్లూరు (వైద్యం) మే 6 : కరోనా బాధితుల కోసం జిల్లాలోని పరిశ్రమల నుంచి ఆక్సిజన్‌ సేకరించనున్నట్లు కలెక్టర్‌ చక్రధర్‌బాబు వెల్లడించారు. గురువారం డీఆర్‌డీవో చైర్మన్‌ సతీ్‌షరెడ్డి 40 కాన్సెంట్రేట్‌ ఆక్సిజన్‌ పరికరాలను అధికారులకు అందచేశారు. ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో ఉన్న వాటిని పరిశీలించిన అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ క్యాజువాలిటీలో ఉన్న కరోనా బాధితులకు వీటిని వినియోగిస్తామన్నారు. వీటిని అందజేసిన సతీష్‌రెడ్డికి ధన్యవాతాలు తెలిపారు. జేసీ బాపిరెడ్డితో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి ఆక్సిజన్‌ వినియాగం, లభ్యత, అవసరాలను గుర్తించి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గత మూడు వారాలుగా 30 నుంచి 33 శాతం పాజిటివ్‌ కేసులు నమోదు అవుతుండటంతో ఆసుపత్రులపై  ఒత్తిడి పెరుగుతోందన్నారు. బాధితులకు అవసరమైన రెమ్‌డిసివిర్‌ ఇంజక్షన్‌లు అందుబాటులో ఉన్నాయని, ఎవరైనా బ్లాక్‌మార్కెట్‌కు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలు ప్రకారం కర్ఫ్యూ విధించామని, ప్రజలు అర్థం చేసుకుని సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేసీ బాపిరెడ్డి, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రభాకర్‌, డాక్టర్‌ మస్తాన్‌బాషా తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-07T04:33:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising