ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధి పనులపై ఏపీడీ విచారణ

ABN, First Publish Date - 2021-11-06T04:24:48+05:30

మండలంలోని పలు గ్రామాల్లో 2017లో జరిగిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో జరిగిన అక్రమాలపై శుక్రవారం జిల్లా డ్వామా అసిస్టెంట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ సతీ్‌షకుమార్‌ విచారణ చేపట్టారు.

చెక్‌డ్యాంను పరిశీలిస్తున్న ఏపీడీ సతీ్‌షకుమార్‌, సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుత్తలూరు, నవంబరు 5: మండలంలోని పలు గ్రామాల్లో 2017లో జరిగిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో జరిగిన అక్రమాలపై శుక్రవారం జిల్లా డ్వామా అసిస్టెంట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ సతీ్‌షకుమార్‌ విచారణ చేపట్టారు. మండలంలోని జంగాలపల్లి, బోడవారిపల్లి, బండకిందపల్లి, దుత్తలూరు, వెంగన్నపాళెం గ్రామాల్లో పనులు చేయకుండానే బిల్లులు చేయించుకొన్నారని ఫిర్యాదులు రావడంతో విచారణ చేస్తున్నామన్నారు. అప్పట్లో పనులు చేయకుండానే రూ.70 లక్షల మేర బిల్లులు చేయించుకోవడంతో అప్పడు విచారణ చేసిన అధికారులు ఈ బిల్లులను నిలిపివేశారని, అయితే వీటిని మళ్లీ పునరుద్ధరించుకుని బిల్లులు చేసుకొన్నారని తెలిపారు. వీటిపై విచారణ చేసి జిల్లా అధికారులకు నివేదికలు అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. బ్రహ్మేశ్వరం గ్రామంలోని మరకరల వాగుపై 1996లో నిర్మించిన చెక్‌డ్యాంను మళ్లీ 2017లో మరమ్మతులు చేసినట్లు బిల్లులు చేశారని, దీనిపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే బండకిందపల్లి, జంగాలపల్లి, బోడవారిపల్లి, ఇతర గ్రామాల్లో కూడా అప్పట్లో చేసిన పనులపై విచారణ చేసి చర్యలు తీసుకొనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీవో శ్రీనివాసులు, ఉపాధి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-11-06T04:24:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising