ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఉపాధి’లో రూ.1.19 లక్షల రికవరీకి ఆదేశం

ABN, First Publish Date - 2021-02-25T04:28:06+05:30

స్థానిక మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో ఉపాధి హామీ పనుల సామాజిక తనిఖీల్లో భాగంగా బుధవారం నిర్వహించిన బహిరంగ చర్చా వేదికలో రూ.1,19,035 రికవరీకి అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

బహిరంగ చర్చావేదికలో సిబ్బందిని విచారిస్తున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుత్తలూరు(ఉదయగిరి రూరల్‌), ఫిబ్రవరి 24: స్థానిక మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో ఉపాధి హామీ పనుల సామాజిక తనిఖీల్లో భాగంగా బుధవారం నిర్వహించిన బహిరంగ చర్చా వేదికలో రూ.1,19,035 రికవరీకి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 2019 ఏప్రిల్‌ నుంచి 2020 మార్చి వరకు మండలంలోని 17 పంచాయతీల్లో జరిగిన పనులపై సామాజిక తనిఖీ బృందం గ్రామాల్లో పనులు పరిశీలించారు. ఉపాధి హామీ కింద రూ.3,36,37,338, సెర్ఫ్‌ రూ.5,01,752, పంచాయతీరాజ్‌ రూ.91,86,388, హౌసింగ్‌ రూ.1,440 చొప్పున రూ.4,33,26,929  ఖర్చు చేశారు. బహిరంగ చర్చావేదికలో ఆడిట్‌ బృందం నివేదికలు చదివి వినిపించారు. దీంతో అధికారులు చివరిగా ఉపాధిలో రూ.49,559, సెర్ఫ్‌కు రూ.32,384, పశుసంవర్థక శాఖ రూ.28,407, అటవీ శాఖకు సంబంఽధించి రూ.8,685 చొప్పున మొత్తం రూ.1,19,035 రికవరీకి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డ్వామా ఆడిషనల్‌ పీడీ సతీ్‌షబాబు, ఏపీడీ విజయకుమార్‌, విజిలెన్స్‌ అధికారి వెంకటేశ్వరరావు, ఏపీవో శీనునాయక్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-25T04:28:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising