ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిలకడలేని పొగాకు ధర..!

ABN, First Publish Date - 2021-04-14T03:38:42+05:30

జిల్లాలోని డీసీపల్లి, కలిగిరి పొగాకు వేలం కేంద్రాల్లో పొగాకు ధర నిలకడగా ఉండటంలేదు. రోజుకో ధర నమోదు కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి.

డీసీ పల్లిలో జరుగుతున్న పొగాకు కొనుగోళ్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆందోళనలో రైతులు

మర్రిపాడు, ఏప్రిల్‌ 13: జిల్లాలోని డీసీపల్లి, కలిగిరి పొగాకు వేలం కేంద్రాల్లో పొగాకు ధర నిలకడగా ఉండటంలేదు. రోజుకో ధర నమోదు కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి. వ్యాపారస్థులు మాయాజాలం ప్రదర్శించి రైతును నిలువు దోపిడీ చేస్తున్నారు. కొనుగోళ్లను పట్టించుకుని, అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలిచేవారే కరువయ్యారు. రెండు నెలల క్రితం ప్రారంభమైన కొనుగోళ్లలో ప్రారంభంలో గరిష్ఠ ధర కిలో రూ.180 పలికింది. అనంతరం రూ.181 చేరింది. రూపాయి పెరిగిందనుకునే తరుణంలో తిరిగి యథాస్థితికి వచ్చింది. ఇళ్లల్లో ఉన్న పొగాకు తీవ్రమైన ఎండలకు, వడగాలులకు చెడిపోయి నాణ్యత కోల్పోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు. సిగరెట్‌, గుట్కా ధరలు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నా పొగాకు ధరల్లో మాత్రం పెరుగుదల కనిపించడం లేదు. పొగాకు ధరల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర పొగాకు బోర్డు, వేలం కేంద్రాల రైతు ప్రతినిధులు రైతుల పక్షంలో నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారనే విమర్శలు ఉన్నాయి.  

నిలకడ లేని సగటు ధర

డీసీపల్లి, కలిగిరి పొగాకు వేలం కేంద్రాల్లో సగటు ధర నిలకడగా ఉండడం లేదు. ఎప్పుడైతే సగటు ధర నిలకడగా ఉంటాయో అప్పుడే రైతులకు ఓ మోతాదు ధర లభిస్తుంది. 

కనిష్ఠ, సరాసరి ధర కూడా..

కనిష్ఠ ధర చూస్తే ప్రారంభంలో కిలోకు రూ.170 పలికింది. నేడు అదే కిలో కనిష్ఠ ధర రూ.120 నమోదవుతుంది. సరాసరి ధర విషయానికి వస్తే రూ.176 నమోదయ్యేది. నెల రోజులకు రూ.156 పడిపోయింది. ఇలా ఒక్కసారి ఉన్న ధర రోజులు గడిచే కొద్ది దిగజారడం, నిలకడగా ఉండకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.



Updated Date - 2021-04-14T03:38:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising