ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి విద్యార్థులే.. రేపటి శాస్త్రవేత్తలు

ABN, First Publish Date - 2021-02-27T03:53:16+05:30

నేటి విద్యార్థులే.. రేపటి శాస్త్రవేత్తలని జిల్లా సైన్స్‌ అధికారి జీ శ్రీనివాసులు తెలిపారు

విజేతలుగా నిలిచిన విద్యార్థులతో అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 జిల్లా సైన్స్‌ అధికారి శ్రీనివాసులు


వెంకటాచలం, ఫిబ్రవరి 26 : నేటి విద్యార్థులే.. రేపటి శాస్త్రవేత్తలని జిల్లా సైన్స్‌ అధికారి జీ శ్రీనివాసులు తెలిపారు. మండలంలోని చెముడుగుంట వద్ద ఉన్న జిల్లా సైన్స్‌ కేంద్రంలో శుక్రవారం రాష్ట్ర, శాస్త్ర సాంకేతిక మండలి ఆధ్వర్యంలో పాఠశాల విద్యాశాఖ నెల్లూరు వారి సమన్వయంతో జాతీయ సైన్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పరిశీలన, ప్రశ్నించేతత్వం అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో వారు శాస్త్రవేత్తలుగా మారతారన్నారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు ఈ గుణాలు అలవాటు కావాలని పేర్కొన్నారు. అందుకు ఉపాధ్యాయులు కూడా విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు.   అనంతరం జిల్లా స్థాయి ప్రాజెక్టు ప్రదర్శన నుంచి ముగ్గురు విద్యార్థులు, క్విజ్‌ పోటీలకు మరో ముగ్గురు విద్యార్థులు ఎంపికైనట్లు శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కార్యక్రమంలో జిల్లా భౌతిక శాస్త్రవేత్తల ఫోరం అధ్యక్షుడు కేవీఆర్‌ మూర్తి, అప్‌కాస్ట్‌ ప్రతినిధులు జేవీ రమేష్‌, ఏ ప్రభాకర్‌, సీహెచ్‌ మారుతి కేశవకుమార్‌, ఏ. ప్రసాద్‌, లలిత మాధవీ తదితరులు పాల్గొన్నారు.   

Updated Date - 2021-02-27T03:53:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising