ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెత్త నగరంలా నెల్లూరు

ABN, First Publish Date - 2021-01-25T05:28:03+05:30

నెల్లూరు నగరం ఎక్కడ చూసిన చెత్తతో నిండి ఉందని, నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని చెబుతున్న ప్రభుత్వ పెద్దలు, కార్పొరేషన్‌ అధికారులు చెత్త నగరంగా మారుస్తున్నారని జనసేన నాయకుడు కేతంరెడ్డి వినోద్‌రెడ్డి ఆరోపించారు.

పేరుకు పోయిన చెత్తను పరిశీలిస్తున్న జనసేన నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జనసేన నాయకుడు కేతంరెడ్డి 

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), జనవరి 24: నెల్లూరు నగరం ఎక్కడ చూసిన చెత్తతో నిండి ఉందని, నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని చెబుతున్న ప్రభుత్వ పెద్దలు, కార్పొరేషన్‌ అధికారులు చెత్త నగరంగా మారుస్తున్నారని జనసేన నాయకుడు కేతంరెడ్డి వినోద్‌రెడ్డి ఆరోపించారు. బారకాస్‌, కలెక్టరేట్‌, చిన్నబజార్‌, పెద్దబజార్‌ తదితర ప్రాంతాల్లో ఆ పార్టీ నాయకులు ఆదివారం పర్యటించారు. చెత్తకుండీల నిర్వహణను పరిశీలించారు. వినోద్‌రెడ్డి మాట్లాడుతూ రేషన్‌ సరుకుల పంపిణీ కోసం రూ.500 కోట్లు ఖర్చు చేసి వాహనాలు కొనుగోలు చేసిన ప్రభుత్వం, కార్పొరేషన్‌ పరిధిలో చెత్తను తొలగించేందుకు మాత్రం సరైన వాహనాలను కొనుగోలు చేయడంలేదని విమర్శించారు. తక్షణం పారిశుధ్య సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పావుజెన్ని చంద్రశేఖర్‌రెడ్డ్డి, కాకు మురళీ రెడ్డి, శ్రీకాంత్‌ యాదవ్‌, హేమంత్‌, వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-25T05:28:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising