ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అరాచక ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారు

ABN, First Publish Date - 2021-10-22T04:52:26+05:30

ప్రభుత్వంలో ఉండి ధర్నాలు, దీక్షలు చేయడానికి వైసీపీ నాయకులకు సిగ్గుఉండాలి.. ప్రజా ప్రతినిధులుగా ఉండి మంత్రులు, ఎమ్మెల్యేలు బూతులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూళ్లూరుపేట, అక్టోబరు 21 : ప్రభుత్వంలో ఉండి ధర్నాలు, దీక్షలు చేయడానికి వైసీపీ నాయకులకు సిగ్గుఉండాలి.. ప్రజా ప్రతినిధులుగా ఉండి మంత్రులు, ఎమ్మెల్యేలు బూతులు మాట్లాడటం ప్రజాస్వామ్యంపై వారికి ఉన్న గౌరవం ఎటువంటిదో అర్థమవుతుందని అరాచక ప్రభుత్వానికి బుద్ధి చెప్పేరోజులు దగ్గరలోనే ఉన్నాయని నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి నెలవల సుబ్రహ్మణ్యం ఎద్దేవా చేశారు. మంగళగిరిలో గురువారం 36 గంటల దీక్ష చేపట్టిన చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకు సూళ్లూరుపేట నియోజకవర్గం నుంచి 25 వాహనాలలో ఆయన నేతలు, కార్యకర్తలతో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ నాయకులే బూతులు తిట్టి దాడులు చేస్తారు... తప్పుడు కేసులు పెట్టిస్తారు.. ఇన్ని అరాచకాలు చేస్తూ మళ్లీ ప్రజల ముందు నంగనాసుల్లా దీక్షలు చేస్తుండటం చూస్తుంటే మొగుణ్ణికొట్టి మొగసాల కెక్కినట్లు సామెత గుర్తుకొస్తుందని వ్యాఖ్యానించారు. ప్రజలు వైసీపీ దౌర్జన్యాలను చూస్తు న్నారని వాళ్లకి తగిన బుద్ధిచెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. ఆయనతోపాటు తిరుపతి పార్లమెంట్‌ పార్టీ అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్‌రెడ్డి, సీనియర్‌ నాయకుడు గూడూరు రఘునాథరెడ్డి, మాజీ జడ్పీటీసీ శ్రీరామ్‌ ప్రసాద్‌, నాయు డుపేట మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, సూళ్లూరుపేట పట్టణ అధ్యక్షుడు ఆకుతోట రమేష్‌, నాయుడుపేట, సూళ్లూరుపేట రూరల్‌ అధ్యక్షులు కామిరెడ్డి అశోక్‌రెడ్డి, కె.శంకరయ్య, మేడా సాయి, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-22T04:52:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising