ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్దేశ పూర్వకంగా నామినేషన్ల తిరస్కరణ

ABN, First Publish Date - 2021-02-02T02:51:24+05:30

మండలంలోని ఇస్కపల్లి పంచాయతీ సర్పంచుగా పోటీ చేయాలనే ఉద్దేశంతో తాము స్వతంత్య్ర అభ్యర్థులుగా నామినేషన్లు దా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


పొంతన లేని సమాధానాలు చెప్తున్న అధికారులు 

అల్లూరు, ఫిబ్రవరి 1 : మండలంలోని ఇస్కపల్లి పంచాయతీ సర్పంచుగా పోటీ చేయాలనే ఉద్దేశంతో తాము స్వతంత్య్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశామని, అయితే అధికారులు ఉద్దేశ పూర్వకంగానే తమ నామినేషన్లను తిరస్కరించారని అల్లూరు మండలం ఇస్కపల్లికి చెందిన మైపాటి సుబ్రహ్మణ్యం, పుచ్చలపల్లి శీనయ్యలు తెలిపారు. సోమవారం ఎన్నికల అధికారులు నిర్వహించిన పరిశీలనలో భాగంగా తమ పేర్లను ముందుగా జాబితాలో పొందుపరచి కార్యాలయం నోటీసు బోర్డులో ఉంచారన్నారు. మరలా నాయకుల వద్ద నుంచి వచ్చిన ఆదేశాలతో నిర్ణయాలు తీసుకొని తమ పేర్లను జాబితాలో నుంచి తొలగించారని వారు పేర్కొన్నారు. ఏ కారణంతో తమ పేర్లను తొలగించారని అధికారులను ప్రశ్నించగా ఎస్సీ కేటగిరి కింద శంభన్‌ కులస్థులు లేరని దీంతో తాము తిరస్కరించామని తేల్చి చెప్పారన్నారు.  ఈ విషయాన్ని ఎన్నికల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని, ఇందులో తాము సొంత నిర్ణయం  ఏదీలేదని  అధికారులు స్పష్టం చేశారు. 


Updated Date - 2021-02-02T02:51:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising