ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘మున్సిపల్స్‌’లో విజయం టీడీపీదే!

ABN, First Publish Date - 2021-11-06T05:21:15+05:30

బుచ్చి నగర పంచాయతీ ఎన్నికల్లో విజయం టీడీపీదేనని మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి


బుచ్చిరెడ్డిపాళెం, నవంబరు 5: బుచ్చి నగర పంచాయతీ ఎన్నికల్లో విజయం టీడీపీదేనని మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అన్నారు.శుక్రవారం బుచ్చి పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు ఎంవీ.శేషయ్య అధ్యక్షతన నామినేషన్లు వేసిన 52మంది కౌన్సిలర్‌ అభ్యర్థులు, టీడీపీ రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు, మాజీ ఎమ్మెల్యేలు దివి శివరాం, కంభం విజయరామిరెడ్డితోపాటు గూటూరు కన్నబాబు, చంద్రారెడ్డి, పెంచలబాబు తదితరులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ అభివృద్ధి కార్యక్రమాలే గెలిపిస్తాయని చెప్పుకునే మీకు.. టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేస్తే భయమెందుకన్నారు. దౌర్జన్యాలకు పాల్పడకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగనివ్వాలని హితవు పలికారు. ఈ నేపథ్యంలో ప్రతి అభ్యర్థి ఒక్కో ఇంటికి పదిసార్లు తిరిగి ఓట్లు అభ్యర్థించి, అధికార పార్టీ ఆగడాలను వివరించాలన్నారు. 20వార్డులకు ఇన్‌చార్జులు దగ్గరుండి ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చూస్తారని అభ్యర్థులకు  సూచించారు.  సమావేశంలో నాయకులు హరికృష్ణ, కావలి వెంకటేశ్వర్లు, హరనాథ్‌, రామానాయుడు, విజయకృష్ణారెడ్డి, వుసురుపాటి ప్రసాద్‌, విల్సన్‌, కోదండరామిరెడి,్డ  నాగరాజు, శ్రీను, పెంచలయ్య, ఉమ్మయ్యస్వామి, మస్తానయ్య, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-11-06T05:21:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising