ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేవిరెడ్డి శారదా ట్రస్ట్‌ సేవలు అభినందనీయం : ఎంపీ ఆదాల

ABN, First Publish Date - 2021-10-19T03:30:58+05:30

సేవా దృక్పథంతో ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి ఉచిత విద్య, మెరుగైన వైద్యసేవలు అందించడంతోపాటు పేదలు శుభ కార్యములు జరిపించుకునేందుకు వసతులు కల్పించిన దేవిరెడ్డి శారదా చారిటబుల్‌ ట్రస్ట్‌ సేవలు అభినందనీయమని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు.

మాట్లాడుతున్న ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అల్లూరు, అక్టోబరు 18 : సేవా దృక్పథంతో ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి ఉచిత విద్య, మెరుగైన వైద్యసేవలు అందించడంతోపాటు పేదలు శుభ కార్యములు జరిపించుకునేందుకు వసతులు కల్పించిన దేవిరెడ్డి శారదా చారిటబుల్‌ ట్రస్ట్‌ సేవలు అభినందనీయమని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. ఇందుపూరు కాలువ వద్ద ఏర్పాటు చేసి ఉన్న దేవిరెడ్డి శరదా చారిటబుల్‌ ట్రస్ట్‌ను ఆయన సోమవారం సందర్శించారు. ట్రస్ట్‌లోని తరగతి గదులతోపాటు సేవా సౌకర్యాలపై చర్చించారు. దేవిరెడ్డి సుధాకర్‌రెడ్డి తన సతీమణి జ్ఞాపకార్థంగా ఈ సేవలను అందించడం గొప్ప కార్యక్రమమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విజయ డెయిరీ చైర్మన్‌ కొండ్రెడ్డి రంగారెడ్డి, ట్రస్ట్‌ సభ్యులు దేవిరెడ్డి దశరథరామిరెడ్డి, ఎంపీపీ దర్శిగుంట శశిరేఖ, జడ్పీటీసీ వేణమ్మ,  వైసీపీ నాయకులు దండా కృష్ణారెడ్డి, బీద రమేష్‌బాబు, నీలం సాయికుమార్‌, సీఈవో దేవన్‌ కుమార్‌, అనిల్‌కుమార్‌ రెడ్డి, మధురెడ్డి, ఇస్కపల్లి సర్పంచు పాటి రంజిత్‌ కుమార్‌, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-19T03:30:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising