ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్లాస్టిక్‌తో పర్యావరణానికి పెను ముప్పు

ABN, First Publish Date - 2021-11-28T04:02:29+05:30

ప్లాస్టిక్‌తో పర్యావరణానికి పెను ముప్పు ఏర్పడుతుందని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతా్‌పకుమార్‌రెడ్డి పేర్కొన్నారు.

ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రతా్‌పకుమార్‌ రెడ్డి, ఆర్డీవో శీనానాయక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్యే ప్రతా్‌పకుమార్‌ రెడ్డి

కావలిటౌన్‌, నవంబరు 27: ప్లాస్టిక్‌తో పర్యావరణానికి పెను ముప్పు ఏర్పడుతుందని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతా్‌పకుమార్‌రెడ్డి పేర్కొన్నారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వాడకంపై కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్‌ కన్జ్యుమర్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌  ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ర్యాలీలో ఆర్డీవో శీనానాయక్‌తో కలసి ఎమ్మెలే పాల్గొన్నారు. పట్టణంలోని ఒంగోల్‌ బస్టాండ్‌ వద్ద ప్రారంభమైన ర్యాలీ ట్రంకురోడ్డు మీదుగా ఎమ్పీడీవో కార్యాలయం వరకు సాగింది. ఎమ్మెల్యే ప్రతా్‌పకుమార్‌రెడ్డి మాట్లాడుతూ ప్లాస్టిక్‌ నివారణ  సామాజిక బాధ్యత అన్నారు. వ్యాపారులు ప్లాస్టిక్‌ కవర్లు విక్రయించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అసలు పరిశ్రమలు వాటిని తయారు చేయకుండా చర్యలు తీసుకోవాలని, అతికమ్రించిన వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ శివారెడ్డి, డీఈ శ్రీనివాసులు, ఏపీసీఆర్‌పీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కె తిరుపాలు, రాష్ట్ర కార్యదర్శి శేషయ్య, శివరామప్రసాద్‌, నాయకులు కనమర్లపూడి నారాయణ, జనిగర్ల మహేంద్ర, తిరివీధి ప్రసాద్‌, దామిశెట్టి సుధీర్‌నాయుడు, అమరా వేదగిరి, గంధం ప్రసన్న, పందిటి కామరాజు, వడ్లమూడి వెంకటేశ్వర్లు, డేగా రాము, జీవీ నాగాచారి, నున్నా మురళీ తదితరులు పాల్గొన్నారు. 

కొవిడ్‌ బాధిత కుటుంబాలకు నిత్యావసరాల కిట్ల పంపిణీ

కొవిడ్‌ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే ప్రతా్‌పకుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ముసునూరులోని ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ కార్యాలయంలో కరోనాతో తల్లి లేదా తండ్రిని పోగొట్టుకున్న 18 ఏళ్ల లోపు చిన్నారులకు నిత్యావసర సరుకులతో కూడిన ఫుడ్‌ రిలీఫ్‌ కిట్లను పంపిణీ చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, కేర్‌ ఇండియా వారి భాగస్వామ్యంతో ఐసీడీఎస్‌ సీడీపీవో పద్మజ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతోపాటు ఆర్డీవో శీనానాయక్‌, తహసీల్దారు మాధవరెడ్డి, ఆధ్యాత్మికవేత్త జనిగర్ల మహేంద్ర, మాజీ కౌన్సిలర్‌ పందిటి కామరాజు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-28T04:02:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising