ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘాటెక్కిన ఎండుమిర్చి

ABN, First Publish Date - 2021-04-17T05:56:37+05:30

ఈసారి ఎండు మిర్చి ధర ఆశాజనకంగా ఉండడంతో మెట్ట రైతులు ఊరట చెందుతున్నారు. పచ్చిమిర్చికి ధర లేక నష్టపోయిన

ఎండుమిర్చి కోసం వదిలేసిన పంట
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ధర ఆశాజనకం 

దిగుబడి లేక రైతుల దిగాలు

అనంతసాగరం, ఏప్రిల్‌ 16: ఈసారి ఎండు మిర్చి ధర ఆశాజనకంగా ఉండడంతో మెట్ట రైతులు ఊరట చెందుతున్నారు. పచ్చిమిర్చికి ధర లేక నష్టపోయిన రైతులు ఎండుమిర్చితో నష్టాలు అధిగమించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న ధరకు తగినట్లు దిగుబడి లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. అనంతసాగరం మండలం సంజీ వనగరం, గౌరవరం, చిలకలమర్రి, మంగుపల్లి, అగ్రహారం, బొమ్మవరం, యాకర్లపాడు, గోగులపల్లి, చాపురాళ్లపల్లి, గుడిగుంట, ఎగువపల్లి గ్రామాల్లో విస్తారంగా మిర్చి పంట సాగు చేశారు. అయితే వాతావరణం అనుకూలించక పలు గ్రామాల్లో పంట దెబ్బతింది. చేతికందిన పచ్చిమిర్చికి సరైన ధర లేక ఆందోళన చెందారు. అయితే ఎండుమిర్చి క్వింటా ప్రస్తుతం రూ.11 వేల నుంచి రూ.12 వేలు ధర ఉండడంతో పంటను దాని కోసం వది లి ఉన్నారు. ఎకరా సాగుకు ఎండు మిర్చి 20 నుంచి 30 క్వింటాలు రావలసి ఉండగా 10 నుంచి 20 క్వింటాలు మాత్రమే చేతికందుతుం దని రైతులు వాపోతున్నారు. దిగుబడులు ఇంకా వచ్చి ఉంటే బాగుం డేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మండలంలో ఎండు మిర్చి గుంటూరు, తాడేపల్లిగూడెం మార్కెట్లకు తరలుతుంది. ఈ సీజన్‌లో సరాసరిన 150 టన్నుల ఎండు మిర్చి మార్కెట్‌కు చేరుతుంది.

Updated Date - 2021-04-17T05:56:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising