చిక్కుల్లో పడ్డ వైసీపీ మంత్రి
ABN, First Publish Date - 2021-07-05T17:10:43+05:30
నెల్లూరు: ఏపీ నీటిపారుదలశాఖ మంత్రి అనిల్ కుమార్ వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు.
నెల్లూరు: ఏపీ నీటిపారుదలశాఖ మంత్రి అనిల్ కుమార్ వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఎందుకంటే.. సర్వేపల్లి కాలువకు రెండు వైపుల దిగువన కాంక్రీట్ పనులు మొదలెట్టారు. కాలువలో నీరు భూమిలో ఇంకడంవల్ల ఇప్పటి వరకు నగర వాసులకు నీటి కష్టాలు తక్కువే. ప్రస్తుతం జరుగుతున్న కాంక్రీట్ పనులతో నీటి ఇబ్బందులు వస్తాయంటూ ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. కాంట్రీట్ పనులు రీ టెండరింగ్ వల్ల వరిగిందేమిటంటూ ప్రశ్నిస్తున్నాయి.
నెల్లూరు పెన్నా బ్యారేజ్ నుంచి సర్వేపల్లి, జాఫర్ సాహెబ్ కాలువలు ఉన్నాయి. బ్యారేజ్‌లో ఒక టీఎంసీ నీటిని నిలువ చేసే అవకాశం ఉంది. కాలువల ద్వారా కింది ప్రాంతాలు, పొలాలకి నీటిని అందించేలా బ్రిటిష్ వారు డిజైన్ చేశారు. కాటన్ దొర కొన్నాళ్లపాటు నెల్లూరులోనే ఉండి బ్యారేజీ, కాలువ పనులు పర్యవేక్షించారు. వారి ఆలోచనల వల్ల నాటి నుంచి నేటికి నెల్లూరు నగరవాసులకు పెద్దగా నీటి కష్టాలు లేవు.
Updated Date - 2021-07-05T17:10:43+05:30 IST