ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మినీ స్టేడియం నిర్మాణానికి గ్రహణం!

ABN, First Publish Date - 2021-12-26T03:10:46+05:30

ఉదయగిరిలో మినీ స్టేడియం నిర్మాణానికి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.1.40 కోట్లు మంజూరయ్యాయి.

అర్ధాంతరంగా పనులు నిలిచిన మినీ స్టేడియం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ హయాంలో ప్రారంభం

మూడేళ్లుగా ఆగిన పనులు

క్రీడాభిమానుల్లో అసంతృప్తి

ఉదయగిరి డిసెంబరు 25: ఉదయగిరిలో మినీ స్టేడియం నిర్మాణానికి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.1.40 కోట్లు మంజూరయ్యాయి. ఆ నిధులతో మూడేళ్ల క్రితం పనులు ప్రారంభించారు. ఆతర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులకు గ్రహణం పట్టింది. ప్రస్తుతం ఆ ప్రదేశంలో చిల్లచెట్లు మెలచి శ్మశానాన్ని తలపిస్తోంది. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రజాప్రతినిధులు దీని వైపు కన్నెత్తి చూడకపోవడంపై క్రీడాభిమానులు, ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతుంది. టీడీపీ హయాంలో అప్పటి ఎమ్యెల్యే బొల్లినేని రామారావు కృషితో మంజూరైన మినీ స్టేడియం నిర్మాణానికి రూ.1.40 కోట్ల మంజూరుకాగా చేపట్టిన పనులకు రెండు విడతల్లో రూ.44 లక్షలు బిల్లులు అందాయి. వైసీపీ ప్రభుత్వంలో నిధులు విడుదలకాకపోవడంతో పనులకు గ్రహణం పట్టింది. బిల్లులు రావన్న ఉద్ధేశ్యంతో కాంట్రాక్టర్లు పనులు చేయకుండా చేతులెత్తేశారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి మినీ స్టేడియం నిర్మాణాన్ని పూర్తి చేయించే దిశగా చర్యలు చేపట్టాలని క్రీడాభిమానులు, ప్రజలు కోరుతున్నారు. 


Updated Date - 2021-12-26T03:10:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising