ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భక్తిశ్రద్థలతో మాఘ పూర్ణిమ

ABN, First Publish Date - 2021-02-28T04:09:00+05:30

జిల్లాలో అన్ని వైష్ణవ, అమ్మవారి ఆలయాల్లో శనివారం మాఘ పూర్ణిమ వేడుకల్ని భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.

గరుడసేవలో రంగనాఽథుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు(సాంస్కృతికం), ఫిబ్రవరి 27 :  జిల్లాలో అన్ని వైష్ణవ, అమ్మవారి ఆలయాల్లో శనివారం మాఘ పూర్ణిమ వేడుకల్ని భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ప్రాతఃకాలంలో నదీ, సముద్ర స్నానాలు చేసి తమ ఇష్టదైవాలను పూజించారు. ఉపవాసాలు, దానధర్మాలు చేశారు. నగరంలోని తల్పగిరి రంగనాఽథస్వామి ఆలయంలో ఉదయం తిరుమంజనం సేవలు జరిగాయి. రాత్రి గరుడ సేవ ఉత్సవం జరిగింది. ఈ వేడుకల్లో ఆలయ చైౖర్మన్‌ కోట గురుబ్రహ్మం, ధర్మకర్తలు, ఈవో డి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. నవాబుపేట ఉడయవర్లు దేవస్థానంలో మాఘపౌర్ణమి పూజలు జరిగాయి. నిత్యహోమాలు, విశేషపూజలు జరిగాయి. ఉదయం స్వామికి మోహినీ అలంకారం కనుల పండువగా జరిగింది. సాయంత్రం సహస్రదీపాల అలంకరణ, ఊంజల్‌ సేవలు జరిగాయి. రాత్రి గరుడ సేవలో స్వామికి నగరోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో దాతలు,  ఈవో సహాయ కమిషనర్‌ శ్రీనివాసులురెడ్డి, వంశపార్యంపర్య ధర్మకర్త, చైర్మన్‌ పల్లాప్రోలు రామకృష్ణమాచార్యులు పర్యవేక్షించారు. మూలాపేట శంకరమఠంలో నవచండీహోమం, విశేషపూజలు జరిగాయి. రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో చండీహోమం, విశేషపూజలు ఘనంగా జరిగాయి. భక్తులు, ధర్మకర్తలు ఉభయకర్తలు పాల్గొన్నారు. మహాత్మాగాంధీనగర్‌ కృష్ణమందిరంలో సత్యనారాయణ వ్రతం కనుల పండువగా జరిగింది. అన్నదానం జరిగింది.  కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-28T04:09:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising