ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లారీని తాడుతో లాగుతూ ఓనర్ల వినూత్న నిరసన

ABN, First Publish Date - 2021-02-27T03:33:35+05:30

పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపును నిరసిస్తూ లారీ ఓనర్లు లారీని తాడుతో లాగి శుక్రవారం పట్టణంలో వినూత్న నిరసన తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలిటౌన్‌, ఫిబ్రవరి 26: పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపును నిరసిస్తూ లారీ ఓనర్లు లారీని తాడుతో లాగి శుక్రవారం పట్టణంలో వినూత్న నిరసన తెలిపారు. ఒక్కరోజు భారత్‌ బంద్‌లో భాగంగా ఆలిండియా ట్రాన్సుపోర్ట్‌ అసోసియోషన్‌ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్‌ లారీ ఓనర్స్‌ అసోసియోషన్‌ ఆధ్వర్యంలో లారీ ఓనర్లు ట్రంకు రోడ్డు ఉత్తర శివార్లలోని లారీ ఓనర్స్‌ అసోసియోషన్‌ కార్యాలయం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ట్రంకురోడ్డుపై తాడుతో లారీని లాగుతూ ప్రదర్శన నిర్వహించారు. ది కావలి లారీ ఓనర్స్‌ అసోసియోషన్‌ గౌరవాధ్యక్షుడు మండలి కృషారావు మాట్లాడుతూ పెంచిన డీజిల్‌ ధర వెంటనే తగ్గించాలని, ఈ వే బిల్లుల సమయాన్ని పెంచాలని డిమాండ్‌ చేశారు. స్కాృప్‌ పాలసీని సవరణ చేయాలని, ప్రతి ఏడాది టోల్‌ రేట్ల పెంపు నిలపాలని కోరారు. థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్‌ ప్రీమియం తగ్గించాలని, గ్రీన్‌ ట్యాక్స్‌ వసూలు నిర్ణయం విరమించుకోవాలన్నారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో అసోసియోషన్‌ అధ్యక్షుడు కే.శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు జొన్నలగడ్డ నరేష్‌, రవికుమార్‌, చెంచురెడ్డి, అనీల్‌కుమార్‌ రెడ్డి, కార్యదర్శులు వాకాటి మాల్యాద్రి, చిమాటా పుల్లపునాయుడు, వల్లెపు శ్రీవర్ధన్‌, సమాది సత్య, మధుసూదన్‌రావు, అన్సర్‌, శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-27T03:33:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising