ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమనీయం శ్రీవారి కల్యాణం

ABN, First Publish Date - 2021-02-25T04:30:14+05:30

పట్ణణంలోని ముసునూరు ట్రంకురోడ్డు వద్ద హనుమత్‌ క్షేత్రంలో వెలసివున్న లక్ష్మీ పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మాత్సవాల్లో భాగంగా బుధవారం మధ్యాహ్నం స్వామి, అమ్మణ్ణుల కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది.

శ్రీవారి కల్యాణమహోత్సవం నిర్వహిస్తున్న అర్చకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలిటౌన్‌, ఫిబ్రవరి 24: పట్ణణంలోని ముసునూరు ట్రంకురోడ్డు వద్ద హనుమత్‌ క్షేత్రంలో వెలసివున్న లక్ష్మీ పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మాత్సవాల్లో భాగంగా బుధవారం మధ్యాహ్నం స్వామి, అమ్మణ్ణుల కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఆలయ వ్యవస్థాపక అర్చకుడు వేదగిరి సూర్యనారాయణాచార్యులు పర్యవేక్షణలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో ఉదయం స్వామికి తోమల సేవ, వధూవరులను చేయడం తదితర ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం నిర్వహించిన కల్యాణమహోత్సవాన్ని తిలకించిన భక్తజనం భక్తిపారవశ్యంతో మంత్రముగ్దులయ్యారు. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతా్‌పకుమార్‌ రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ మన్నెమాల సుకుమార్‌రెడ్డి దంపతులు, ఆధ్యాత్మికవేత్త మన్నెమాల గోవిందురెడ్డి తదితర ప్రముఖులు కల్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆటోనగర్‌ వారిచే భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. సాయంత్ర హోమం పూజల అనంతరం రాత్రి శ్రీవారు గజ వాహనంపై పాతూరులో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.  గురువారం స్వామివారికి గ్రామోత్సవం, మందాటి చెరువులో తెప్పోత్సవ మహోత్సవం జరుగుతుందని అర్చకులు తెలిపారు.



Updated Date - 2021-02-25T04:30:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising