ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా నివారణకు 20 నుంచి లలితా యాగం

ABN, First Publish Date - 2021-06-18T05:03:04+05:30

దేశంలో కరోనా మహమ్మారి నివారణ కోసం మొట్టమొదటి సారిగా ఈనెల 20 నుంచి 24వ తేదీ వరకు లలితా యాగం నిర్వహిస్తున్నట్లు కుర్తాళం పీఠం అర్చకుడు మాచవోలు రమేష్‌శర్మ తెలిపారు.

లలితా యాగం బ్రోచర్లు ఆవిష్కరిస్తున్న రమేష్‌శర్మ తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు(సాంస్కృతికం), జూన్‌ 17 : దేశంలో కరోనా మహమ్మారి నివారణ కోసం  మొట్టమొదటి సారిగా ఈనెల 20 నుంచి 24వ తేదీ వరకు లలితా యాగం నిర్వహిస్తున్నట్లు కుర్తాళం పీఠం అర్చకుడు మాచవోలు రమేష్‌శర్మ తెలిపారు. గురువారం ఉస్మాన్‌ సాహెబ్‌పేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కుర్తాళం పీఠాధిపతి  సిద్దేశ్వరానంద భారతి మహాస్వామి ఆశీస్సులతో మేనెల 7వ తేదీ నుంచి భక్తులతో లక్ష లలితా సమస్రనామ పారాయణం చేయించామన్నారు. అనంతరం 10వేల సహస్రనామాలతో తర్పణం చేయించామన్నారు. ఈనెల 20 నుంచి 24వ తేదీ వరకు సహస్ర నామాలతో లలితా యాగం చేయిస్తున్నామని  తెలిపారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్లను ఆవిష్కరించారు. చివరి రోజు సాయంత్రం లలితా కామేశ్వర కల్యాణం జరుగుతుందని తెలిపారు. లోకకల్యాణార్థం చేస్తున్న ఈ యాగానికి భక్తులు తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఈ సమావేశంలో పాలడుగు సాయి, చంద్రశేఖర్‌ ప్రభు, పీ విజయసారథి, కమల్‌శర్మ పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-18T05:03:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising