ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇక తగినంత ప్రాణవాయువు

ABN, First Publish Date - 2021-06-12T05:07:59+05:30

రాష్ట్రంలో కొవిడ్‌ బాధితుల అవసరాల నిమిత్తం హైదరాబాదుకు చెందిన మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెట్‌ సంస్థ మూడు క్రయోజనిక్‌ ఆక్సిజన్‌ ట్యాంకర్లను కృష్ణపట్నం పోర్టులో శుక్రవారం కలెక్టర్‌ చక్రధర్‌బాబుకు అందజేసింది.

పోర్టులో ఆక్సిజన్‌ ట్యాంకర్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ చక్రధర్‌ బాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



3 క్రయోజనిక్‌ ట్యాంకర్లను అందజేసిన మేఘా సంస్థ 


ముత్తుకూరు, జూన్‌ 11 : రాష్ట్రంలో కొవిడ్‌ బాధితుల అవసరాల నిమిత్తం హైదరాబాదుకు చెందిన మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెట్‌ సంస్థ మూడు క్రయోజనిక్‌ ఆక్సిజన్‌ ట్యాంకర్లను కృష్ణపట్నం పోర్టులో శుక్రవారం కలెక్టర్‌ చక్రధర్‌బాబుకు అందజేసింది. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పశ్చిమబెంగాల్‌ పనాగడ్‌ వైమానిక స్థావరానికి ప్రత్యేక విమానంలో సింగపూర్‌ నుంచి ట్యాంకర్లు చేరుకున్నాయన్నారు. జార్ఖండ్‌ రాష్ట్రంలోని జంషెడ్‌పూర్‌ వద్ద ఆక్సిజన్‌ నింపుకున్న ట్యాంకర్లు ప్రత్యేక రైలులో పోర్టుకు చేరుకున్నట్లు తెలిపారు.  మేఘా అందించిన ఈ మూడు ట్యాంకర్లను పోర్టు నుంచి నెల్లూరు, రాయలసీమ జిల్లాలకు పంపుతామన్నారు. అంతకముందు మేఘా సంస్థ ప్రతినిధి రాజ్‌కుమార్‌ మూడు ట్యాంకర్లను కలెక్టర్‌కు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్కో ట్యాంకర్లో 1.4కోట్ల లీటర్ల ఆక్సిజన్‌ సామర్థ్యం కలిగి ఉందన్నారు. ప్రస్తుతం అందించిన మూడు ట్యాంకర్లతో రూ.1.65కోట్ల విలువ కలిగిన 4.2 కోట్ల లీటర్ల ఆక్సిజన్‌ అందించామన్నారు. ఈ కార్యక్రమంలో జేసీలు బాపిరెడ్డి, హరేందిర ప్రసాద్‌, ఆర్డీవో హుస్సేన్‌ సాహెబ్‌, మేఘా సంస్థ ప్రతినిధులు చిరంజీవి, అసోసియేట్‌ మేనెజర్‌ శర్మ, ఓఅండ్‌ఎం ఇన్‌చార్జి రామకృష్ణ , పోర్టు ప్రతినిధులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-06-12T05:07:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising