ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.9 కోట్లతో శ్రీవారి కోనేటి పునర్నిర్మాణం

ABN, First Publish Date - 2021-05-11T03:39:42+05:30

బోగోలు మండలం కొండబిట్రగుంట బిలకూట క్షేత్రంపై వెలసి ఉన్న ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయ కోనేటిని రూ.9 కోట్లతో పునర్నిరించనున్నట్లు కావలి ఎమ్యెల్యే ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బిట్రగుంట, మే 10: బోగోలు మండలం కొండబిట్రగుంట బిలకూట క్షేత్రంపై వెలసి ఉన్న ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయ కోనేటిని రూ.9 కోట్లతో పునర్నిరించనున్నట్లు కావలి ఎమ్యెల్యే ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన కావలి ఏఎంసీ చైర్మన్‌ సుకుమార్‌రెడ్డితో కలసి కోనేటిని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతు మూడు రోజులుగా కోనేటిలో నీటిని తొలగిస్తున్నామని, వీలైనంత త్వరలో వేద పండితులచే ముహూర్తం ఖరారు చేయించి నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు.  

రెండో పంటకు సాగునీరిస్తాం

రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదని, రెండో పంటకు సాగు నీరు ఇస్తామని కావలి ఎమ్యెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి అన్నారు. బోగోలు మండలం ఎస్వీపీఎం మేజర్‌ కాలును సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  కావలి కాలువకు తొమ్మిది వందల క్యూసెక్కుల నీరు విడుదల చేయిస్తున్నామన్నారు. అందులో ఎస్వీపీఎం మేజర్‌ కాలువకు 250 క్యూసెక్కులు కేటాయించినట్లు తెలిపారు. కావలి కాలువ నుంచి దగదర్తి, ఎస్వీ పీఎం, కావలి రూరల్‌, జలదంకి మండలాలకు సాగునీరు ఇస్తామని భరోసా ఇచ్చారు. ఈమేరకు ఇరిగేషన్‌ ఎస్‌ఈ కృష్ణారావుతో చర్చించారు. ఆయన వెంట కావలి ఏఎంసీ చైర్మన్‌ సుకుమార్‌ రెడ్డి, వైసీపీ మండల కన్వీనర్‌ వీరరఘు, సర్పంచులు ఉప్పాల మాచర్ల, బండ్ల సురేష్‌గౌడ్‌, నేతలు పాపన మల్లారెడ్డి, శ్రీనివాసులు, మల్లికార్జునరెడ్డి, రైతులు ఉన్నారు. 

ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈపై ఎమ్యెల్యే ఆగ్రహం

బోగోలు మండలంలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీరు సక్రమంగా సరఫరా చేయడం లేదని స్థానిక నేతలు ఎమ్యెల్యే ప్రతాప్‌కుమార్‌ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆయన ఈర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈతో ఫోన్లో మాట్లాడుతూ నిర్లక్షం చేస్తే ఊరుకునేది లేదని ఆగ్రహించారు.



Updated Date - 2021-05-11T03:39:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising