ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొడవలూరు గురుకుల పాఠశాల వార్డెన్‌ సస్పెన్షన్‌

ABN, First Publish Date - 2021-10-25T04:32:16+05:30

విఽధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన కొడవలూరు గిరిజన గురుకుల పాఠశాల వార్డెన్‌ నరసింహులును ఆదివారం కలెక్టరు చక్రధర్‌బాబు సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

మాట్లాడుతున్న యానాదుల సంక్షేమ రాష్ట్ర కార్యదర్శి కేసీ పెంచలయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొడవలూరు, అక్టోబరు 24 : విఽధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన కొడవలూరు గిరిజన గురుకుల పాఠశాల వార్డెన్‌ నరసింహులును ఆదివారం కలెక్టరు చక్రధర్‌బాబు సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వసతిగృహంలోని విద్యార్థులకు ఆహారం అందించడంలో వార్డెన్‌ నిర్లక్ష్యం వ్యవహరించారని సహాయ గిరిజన సంక్షేమాధికారి, ఐటీడీఏ పీడీ గుర్తించి కలెక్టరుకు నివేదించడంతో ఆయన చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ అధికారులే దగ్గరుండి భోజన వసతి సదుపాయాలు అందించారు. వార్డెన్‌ను సస్పెండ్‌ చేసి ప్రిన్సిపాల్‌ దేవసహాయంకు బాధ్యతలు అప్పగించారు. తమకు ప్రతి రోజూ భోజనం ఆలస్యంగా వడ్డించేవారని, మెనూ ప్రకారం గుడ్డు, రాగిజావ, అరటిపండ్లు, వేరుశనగ ముద్ద అందించడం లేదని విద్యార్థులు  వాపోయారు.  


వార్డెన్‌పై చర్యకు డిమాండ్‌

గురుకుల పాఠశాల విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించని వార్డెన్‌ నరసింహులుపై చర్యలు తీసుకోవాల్సిందిగా యానాదుల సంక్షేమ సంఘ రాష్ట్ర కార్యదర్శి కేసీ పెంచలయ్య డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై పూర్తి విచారణ చేయాలని కోరుతూ ఆదివారం పలువురు నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. వసతిగృహంలో పనిచేసే ఉద్యోగులను కూడా వెంటనే బదిలీ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో యానాది సంక్షేమ సంఘం నాయకులు చేవూరు సుబ్బారావు, ఇండ్ల రవి, మలికి చెంచయ్య, చలంచర్ల రవీంద్ర, చెంబేటి ఉష, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-25T04:32:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising