ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కళాకారులకు ఆర్థికసాయం అందించాలి

ABN, First Publish Date - 2021-06-18T03:44:44+05:30

ఏళ్ల తరబడి కళనే నమ్ముకుని జీవించే తమకు కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లగా జీవనం కోల్పోయాం. ప్రభుత్వం ప్రతి కళాకారుడి కుటుంబానికి రూ.15వేలు ఆర్థికసాయం అందించాలంటూ గురువారం తహసీల్దారు కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి, తహసీల్దారు షఫీమాలిక్‌కు వినతిపత్రం అందజేశారు.

తహసీల్దారుకు వినతిపత్రం అందజేస్తున్న కళాకారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తహసీల్దారు కార్యాలయం ఎదుట నిరసన 


బుచ్చిరెడ్డిపాళెం, జూన్‌ 17: ఏళ్ల తరబడి కళనే నమ్ముకుని జీవించే తమకు కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లగా జీవనం కోల్పోయాం. ప్రభుత్వం ప్రతి కళాకారుడి కుటుంబానికి రూ.15వేలు ఆర్థికసాయం అందించాలంటూ గురువారం తహసీల్దారు కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి, తహసీల్దారు షఫీమాలిక్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ రంగాలకు చెందిన కళాకారులు మాట్లాడుతూ ‘రావాలి జగన్‌.. కావాలి జగన్‌’,  ‘జగనన్నా.. జగనన్నా జనమంతా నీ వెనుకే’ అంటూ పాటలు పాడి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చింది కళాకారులేనని గుర్తు చేశారు. కళనే నమ్ముకుని పాటలు పాడి, కీబోర్డులు, తపలా వాయించి జీవించే తమకు పని లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. సొంత ఇళ్లు లేక.. ఇళ్ల బాడుగలు కట్టుకోలేక పూట గడవడం కూడా కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి స్పందించి కళాకారుల కుటుంబాలకు రూ.15వేలు ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని వారు కోరారు. కార్యక్రమంలో షాకీర్‌బాబు, ఎస్‌కే.మస్తాన్‌, ఖాదర్‌బాషా, విజయ్‌కుమార్‌, సుమారు 40 మంది కళాకారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-18T03:44:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising