ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కబళిస్తున్న కరోనా

ABN, First Publish Date - 2021-05-11T05:12:48+05:30

జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఓ వైపు పాజిటివ్‌లు, మరోవైపు మృతుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన రేగుతోంది.

ఇతర ఆసుపత్రులకు వెళుతున్న బాధితులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 8మంది మృత్యువాత.. 1432 పాజిటివ్‌లు


నెల్లూరు (వైద్యం) మే 10 : జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఓ వైపు పాజిటివ్‌లు, మరోవైపు మృతుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన రేగుతోంది. సోమవారం 1432 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక కరోనా నుంచి కోలుకోలేక 8 మంది బాధితులు  మృత్యువాత పడ్డారు. మరోవైపు 180 మందిని అధికారులు డిశ్చార్జ్‌ చేశారు.  


ఆక్సిజన్‌ కొరతతో..

నెల్లూరులోని పొగతోటలో ఉన్న ఓ కొవిడ్‌ ఆసుపత్రిలో ఆక్సిజన్‌ కొరత ఏర్పడింది. తమ ఆసుపత్రిలో ఆక్సిజన్‌ కొరత ఉందని ప్రత్యామ్నాయ ఆసుపత్రులకు వెళ్లాలని నిర్వాహకులు సూచించడంతో బాధితులు పరుగులు తీశారు. ఆరోగ్యశ్రీ కింద సదరు ఆసుపత్రిలో 25 మంది చికిత్స పొందుతున్నారు. 100 ఆక్సిజన్‌ సిలిండర్లు అవసరమవగా, 30 మాత్రమే అందేబాటులో ఉండటంతో ఆసుపత్రి నిర్వాహకులు ఉన్నతాధికారులు దృష్టికి తీసుకు వెళ్లినా ఫలితం లేకపోయింది. దీంతో చేసేదిలేక కొంతమంది బాధితులు ఇతర ఆసుపత్రులకు వెళ్లారు. కేవలం 10 మంది అత్యవసర బాధితులకు మాత్రమే అక్కడ వైద్యసేవలు అందిస్తున్నట్లు సమాచారం.


హోం ఐసోలేషన్‌ బాధితులకు..

నెల్లూరు(జడ్పీ) : జిల్లాలో హోం ఐసోలేషన్‌లో ఉంటున్న బాధితులకు వైద్యసేవలు అందించడంతోపాటు మందులు పంపిణీ చేస్తున్నట్లు డీపీవో ధనలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. వారి కోసం ప్రత్యేక కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి 24 గంటలు పని చేసేలా సిబ్బంది నియమించినట్లు తెలిపారు. ప్రతి రోజు ఆశా వలంటీర్లు, రోజు మార్చి రోజు ఏఎన్‌ఎంలు, వారానికి రెండు సార్లు డాక్టర్లు బాధితుల వద్దకు వెళ్లి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకుంటారని పేర్కొన్నారు. అలాగే ఉచితంగా మందుల కిట్లను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. 


రూ.11లక్షలపైగా జరినామా 

నెల్లూరు (క్రైం) : కర్ఫ్యూలో నిబంధనలు అతిక్రమిస్తున్న వారు, మాస్కులు ధరించిన వారిపై  పోలీసులు భారీగా కేసులు, జరిమానా విధిస్తున్నారు. 9వ తేదీన ఈ చలానాలతో కలిపి 2,832 కేసులు నమోదు చేయగా, రూ. 9,06,310 జరినామా విధించారు. 10వ తేదీన ఈ చలానాలతో కలిపి 699 కేసులు నమోదు చేయగా రూ.2,50,630 జరినామా విధించారు. కరోనా నియంత్రణకు ప్రజలు సహకరించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఎస్పీ భాస్కర్‌భూషణ్‌ హెచ్చరిస్తున్నారు.   

Updated Date - 2021-05-11T05:12:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising