ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జోరుగా గుట్కా వ్యాపారం

ABN, First Publish Date - 2021-10-27T04:03:14+05:30

కోవూరు పరిసర ప్రాంతాల్లో గుట్కాల వ్యాపారం జోరుగా సాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బైక్‌ల్లో, ఆర్టీసీ బస్సుల్లో తరలింపు

కూరగాయలు, ఫలసరుకుల మాటున గ్రామాలకు..

వ్యాపారాన్ని అడ్డుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి


కోవూరు, అక్టోబరు 26: కోవూరు పరిసర ప్రాంతాల్లో గుట్కాల వ్యాపారం జోరుగా సాగుతోంది. పోలీసు సర్కిల్‌ పరిధిలోని గ్రామాల్లో పోలీసులు దాడులు చేసి కేసులు నమోదు చేసినప్పటికీ వ్యాపారులు గుట్టుగా వ్యాపారం కొనసాగిస్తున్నారు. గుట్కా వినియోగం వల్ల కేన్సర్‌ లాంటి వ్యాఽఽధులు విజృంభిస్తున్నప్పటికీ వినియోగదారులు వెనకడుగు వేయడం లేదు. పట్టణంలోని పలు దుకాణాల్లో గుట్కాల వ్యాపారం జోరుగా సాగుతోంది. ఓ వైపు రాష్ట్రంలో గంజాయి సాగు, వాటి వ్యాపారంపై చర్చ జరుగుతున్నప్పటికీ గ్రామాల్లో గుట్కా వినియోగం ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రభుత్వం మాదకద్రవ్యాల వినియోగంపై స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంటు బ్యూరోను ఏర్పాటు చేసినా నిషేధిత గుట్కాల వ్యాపారం గురించి పట్టించుకోకపోవడంతో వినియోగం బాగా పెరిగింది. అధికారుల కళ్లుగప్పి వ్యాపారులు గుట్కాల సంచులను మోటారు బైక్‌లు, ఆర్టీసీ బస్సులు, ఆటోల్లో తరలిస్తున్నారు. అలాగే కొంతమంది కూరగాయల మాటున, ఫలసరకుల సంచుల్లో గ్రామాలకు గుట్కాల ప్యాకెట్లను తీసుకువెళ్తున్నారు. కోవూరు మండల పరిధిలోని మారుమూల కాలనీల్లో సైతం గుట్కాలను యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. గుట్కాల వ్యాపారాన్ని అడ్డుకోవాల్సిందిగా పలువురు పోలీసు అధికారులను కోరుతున్నారు.  


మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి

యువకులకు ఎంతో భవిష్యత్తు ఉంది. మాదక ద్రవ్యాలు ముఖ్యంగా గుట్కాలు సేవించి అనారోగ్యం పాలవడం బాధాకరం. దీనిపై ఎంతగానో ప్రచారం చేస్తున్నాం. అయినా విద్యార్థులు కూడా గుట్కాలు తీసుకుంటున్నారు. దీనికి వ్యతిరేకంగా అందరూ కృషి చేయాలి.

-వి పాపయ్య, రిటైర్డు టీచరు, అధ్యక్షుడు వేవ్స్‌ సంస్థ, కోవూరు

 

యువకులను చైతన్యవంతం చేయాలి

గుట్కాల వినియోగానికి వ్యతిరేకంగా యువకులను చైతన్యవంతం చేయాలి. గ్రామాల్లో ప్రచారం చేయాలి. పోలీసులు, స్వచ్ఛంద సేవా సంస్ధలు యువకులను కాపాడాలి. కేన్సర్‌ బారిన యువకులు పడకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉంది.

- ఎం శ్రీనివాసులు, జనవిజ్ఞాన వేదిక, కోవూరు. 


కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం

పోలీసు స్టేషన్‌ పరిధిలోని గ్రామాల్లో గుట్కాల అమ్మకాలు జరగడం లేదు. నిత్యమూ నిఘా పెట్టాం. ఎక్కడా గుట్కాల వినియోగం లేదు. ఎన్నో దుకాణాలపై కేసులు నమోదు చేశాం. గుట్కాల వ్యాపారం జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొంటున్నాం. సమాచారమిస్తే దుకాణాల యజమానులపై తగు చర్యలు తీసుకుంటాం.

- డీ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ, కోవూరు

Updated Date - 2021-10-27T04:03:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising