ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కులధ్రువీకరణ పత్రంపై జగన్‌ బొమ్మా?

ABN, First Publish Date - 2021-10-29T03:12:22+05:30

కులం సర్టిఫికెట్‌పై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి బొమ్మలు వేయడం రాజ్యాంగ విరుద్ధమని తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గ బీజేపీ ప్రధాన కార్యదర్శి పనబాక కోటేశ్వరరావు గురువారం విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోట, అక్టోబరు 28 : కులం సర్టిఫికెట్‌పై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి బొమ్మలు వేయడం రాజ్యాంగ విరుద్ధమని  తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గ బీజేపీ ప్రధాన కార్యదర్శి పనబాక కోటేశ్వరరావు గురువారం విమర్శించారు. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.   కులం సర్టిఫికెట్‌ నవరత్నాలలో భాగమా... లేక అభివృద్ధిలో భాగమా, సంక్షేమ పథకమాఅని ప్రశ్నించారు. కులం సర్టిఫికెట్లలో రిజర్వేషన్ల సృష్టికర్త, భారతరాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఫొటోను ముద్రించాలన్నారు. అణగారిన వర్గాల ఆరాధ్యదైవం అంబేద్కర్‌ ఫొటోను ముద్రించాల్సింది పోయి, జగన్‌ ఫొటోను ముద్రించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే వేల కోట్ల నిధులు వారి సంక్షేమానికి ఉపయోగించకుండా ఆ నిధులను వేరే పథకాలకు దారి మళ్లిస్తూ సీఎం సొంతడబ్బా కొట్టుకుంటున్నాడన్నారు. 


Updated Date - 2021-10-29T03:12:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising