ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇందుకూరుపేట వాసికి అంతర్జాతీయ అవార్డు

ABN, First Publish Date - 2021-10-24T04:52:06+05:30

ఇందుకూరు పేటకు చెందిన కవి, చిత్రకారుడుగా గుర్తింపు పొందిన ఆత్మకూరు రామ కృష్ణ అంతర్జాతీయ మరాకిల్‌ అవార్డు అందుకున్నారు.

అవార్డు అందుకుంటున్న రామకృష్ణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇందుకూరు పేట, అక్టోబరు 23 : ఇందుకూరు పేటకు చెందిన కవి, చిత్రకారుడుగా గుర్తింపు పొందిన ఆత్మకూరు రామ కృష్ణ అంతర్జాతీయ మరాకిల్‌ అవార్డు అందుకున్నారు. శనివారం విజయవాడలో జరిగిన సదస్సులో ఈ అవార్డును 13గంటల 26 నిమిషాల్లో షూట్‌ చేసిన 100 ఎపిసోడ్‌ల (చిత్రాలకు) గాను అందుకు న్నారు. కేంద్రీయ విద్యాలయంలో ఆర్ట్‌ టీచరుగా పనిచేస్తున్న రామకృష్ణ 11ఏళ్ల క్రితం బెంగళూరు కేంద్రీయ విద్యాలయంలో ఫింగర్‌ పెయింటింగ్‌ మరాథాన్‌ను నిర్వహించి ప్రపంచ రికార్డును నెలకొల్పారు. కుంచె వంటి ఉపకరణాలు లేకుండా కేవలం చేతివేళ్లతో ఆయిల్‌ కలర్స్‌ని ఫింగర్‌ పె యింటింగ్స్‌గా ఉపయోగించి, 12/16 అంగులాల స్ర్టెచ్డ్‌ క్యాన్‌వాస్‌పై  13:26 గంటల (806)నిమిషాల్లో 100 తైలవర్ణ చిత్రాలను వేశారు. ప్రత్యక్ష సాక్షులుగా నిలిచిన ప్రముఖ చిత్రకారులు, ప్రేక్షకులు, మీడియా ప్రతి నిధుల మధ్య ఆ వంద చిత్రాలను చిత్రీకరించడం జరిగింది. నాటి ఆ సాహసాన్ని మెచ్చి లిమ్కా రికార్డ్‌తోపాటు 13 ప్రపంచ రికార్డు సంస్థలు రామకృష్ణకు ప్రశంసా పత్రాలను అందజేశాయి. కరోనా కష్టకాలంలో దొరికిన సమయాన్ని ఓ చిత్రకారునిగా గతంలో తాను చిత్రీకరించిన   వందల చిత్రాలన్నింటిని వీడియోలుగా మలచి తన విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాల్లో చూపడం జరిగింది. ఆ అనుభవంతో ప్రపంచ రికార్డు కోసం 2010లో 100 చిత్రాలను చిత్రీకరిస్తున్నప్పుడు తీసిన 13:26 గంటల నిడివి గల వీడియో ఫుటేజీ ఆధారంగా మరో నూతన రికార్డు నెలకొల్పాలన్న ఆలోచనతో 100 ఎపిసోడ్‌లను అన్నీ తానై ఈ వీడియోలను రూపొం దించడం మరో విశేషం.  ఈ సందర్భంగా రామకృష్ణకు కేంద్రీయ విద్యా లయం ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పీవీఎస్‌ఎస్‌ఎస్‌ఆర్‌ కృష్ణ, మరాకిల్‌ సంస్థ నిర్వా హకులు, అధ్యాపకుల సమక్షంలో ఘనంగా ఈ అవార్డును అందించి సన్మానించారు. 

Updated Date - 2021-10-24T04:52:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising