ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘గంగ’లో దూకి ఇంటర్‌ విద్యార్థి మృతి

ABN, First Publish Date - 2021-10-25T04:26:09+05:30

ఇంటర్‌ విద్యార్థి తెలుగు గంగ కాలువలో దూకి మృతిచెందాడు. ఈ సంఘటన మండలంలోని చెంబేడు గ్రామ సమీపంలో శనివారం రాత్రి జరిగింది.

సునీల్‌ (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెళ్లకూరు, అక్టోబరు 24 :  ఇంటర్‌ విద్యార్థి తెలుగు గంగ కాలువలో దూకి మృతిచెందాడు. ఈ సంఘటన మండలంలోని చెంబేడు గ్రామ సమీపంలో శనివారం రాత్రి జరిగింది. స్థానికుల సమాచారం మేరకు చెంబేడు బీసీ కాలనీకి చెందిన పాలచ్చూరు సురేష్‌ - సుభాషిణి దంపతులకు ఇద్దరు కుమారులు. వారిలో పెద్ద కుమారుడు ఉదయ్‌కిరణ్‌ డిగ్రీ చదువుతున్నాడు. రెండో కుమారుడు సునీల్‌ (16)  శ్రీకాళహస్తి పట్టణంలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. గతనెలలో ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు రాశాడు.   శనివారం ఫలితాలు విడుదలయ్యాయి. తక్కువ మార్కులు వచ్చాయని మనస్తాపం చెందాడు. సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో కుటుంబసభ్యులకు తెలియకుండా  బయటకెళ్లాడు. రాత్రి 10 గంటలకు కూడా కొడుకు ఇంటికి రాకపోవడంతో కంగారుపడ్డ తల్లిదండ్రులు బంధువులతో కలసి ఊరంతా గాలించినా కనిపించలేదు. ఆదివారం ఉదయం తెలుగుగంగ కాలువ బ్రిడ్జి వద్దకెళ్లే సరికి అక్కడ ఉన్న  చెప్పులు, సెల్‌ఫోన్‌లను గమనించి చూడగా సునీల్‌ మృతదేహం గంగకాలు వలో ఉంది. అనంతరం మృతదేహాన్ని వెలికితీసి ఇంటికి తరలించారు. తల్లిదండ్రులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Updated Date - 2021-10-25T04:26:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising