ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదలందరికీ ఇల్లు

ABN, First Publish Date - 2021-01-19T05:21:05+05:30

నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇల్లు అందచేయడానికి ఇంజనీరింగ్‌ సహాయకులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు ఆదేశించారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గ్రౌండింగ్‌కు సిద్ధంకండి : కలెక్టర్‌

ఇంజనీరింగ్‌ సహాయకులకు శిక్షణ


నెల్లూరు రూరల్‌, జనవరి 18 : నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇల్లు అందచేయడానికి ఇంజనీరింగ్‌ సహాయకులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు ఆదేశించారు. రెండు రోజుల శిక్షణలో భాగంగా నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలోని సచివాలయ ఇంజనీరింగ్‌ సహాయకులకు నెల్లూరు ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం సదస్సు నిర్వహించారు. ఇందులో పాల్గొన్న కలెక్టర్‌ మాట్లాడుతూ బుధవారంతో ఇళ్ల పట్టాల పంపిణీ ప్రక్రియ పూర్తవుతున్న నేపఽథ్యంలో 21వ తేదీ నుంచి ఇళ్ల నిర్మాణాలకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఇందుకు క్షేత్ర స్థాయిలో లబ్ధిదారుల గ్రౌండింగ్‌పై దృష్టి సారించాలన్నారు. ఇళ్ల నిర్మాణాలకు మార్కింగ్‌, లబ్ధిదారుల జియో ట్యాగింగ్‌ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ లోప రహితంగా ఈ పని జరగాలని, ఇళ్ల నిర్మాణం  పారదర్శకంగా ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి, నెల్లూరు ఆర్డీవో హూస్సేన్‌ సాహెబ్‌, హౌసింగ్‌ పీడీ కే ఆది సుబ్రహ్మణ్యం, నెల్లూరు డీఎల్‌డీవో సుజాత, నెల్లూరు రూరల్‌ ఎంపీడీవో డీ వసుమతి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-19T05:21:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising