ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాకెన్నీ సీట్లిస్తారు..!

ABN, First Publish Date - 2021-05-11T04:01:30+05:30

నెల్లూరులో మున్సిపల్‌ రిజర్వేషన్లు ఖరారు చేయడంతో నగర పాలక సంస్థకు ఎన్నికలు అనివార్యమయ్యాయి. కరోనా సెకండ్‌ వేవ్‌ కాస్త తగ్గుముఖం పట్టగానే ఎప్పుడైనా ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉందన్న సంకేతాలు ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రధాన పార్టీలపై సామాజిక వర్గాల వారీ ఒత్తిడి 

 వర్గబలం పెంచుకునేందుకు వ్యూహం

 44 స్థానాలపై బీసీ, ఉన్నత వర్గాల గురి 

 సీట్ల పెంపునకు ముస్లిం మైనార్టీల పట్టు 

నెల్లూరు (సిటీ), మే 10 : నెల్లూరులో మున్సిపల్‌ రిజర్వేషన్లు ఖరారు చేయడంతో నగర పాలక సంస్థకు ఎన్నికలు అనివార్యమయ్యాయి. కరోనా సెకండ్‌ వేవ్‌ కాస్త తగ్గుముఖం పట్టగానే ఎప్పుడైనా ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉందన్న సంకేతాలు ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్నాయి. ఇప్పటికే అటు అధికార, ఇటు ప్రతిపక్ష పార్టీల్లో దాదాపు అభ్యర్థుల తొలి జాబితా సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే సామాజిక వర్గాల వారీగా తమకు ఎన్ని సీట్లను కేటాయిస్తారంటూ ఆయా పార్టీలపై నేతల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. 54 మున్సిపల్‌ డివిజన్లలో ఎస్టీలకు మూడు, ఎస్సీలకు 7 స్థానాలు,  మిగిలిన 44 స్థానాలు బీసీ, ఓసీలకు రిజర్వు చేశారు. 44 సీట్లలో బలమైన వర్గాలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలనే డిమాండ్‌ రాజకీయ పార్టీల ఉంది. గతం కంటే కేటాయింపు పెంచాలంటూ ముస్లిం మైనార్టీలు గొంతు వినిపిస్తున్నారు. 

నెల్లూరు నగరంలోని 54 మున్సిపల్‌ డివిజన్లలో ఎస్టీ, ఎస్టీలకు 10 స్థానాలు పోగా బీసీలకు 17 స్థానాలను కేటాయిస్తూ ప్రభుత్వం గజిట్‌ను విడుదల చేసింది. ఇక జనరల్‌ కేటగిరి కింద మహిళలకు ప్రత్యేకించి 15 స్థానాలు, జనరల్‌ కోటాలో 12 స్థానాలు కేటాయించారు. వాటిలో తమకెన్నీ సీట్లు ఇస్తున్నారంటూ సామాజిక వర్గాలు తెస్తున్న కొత్త డిమాండ్‌  ప్రధాన రాజకీయ పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది. 17 స్థానాల్ను బీసీలలో ఏఏ కులాలకు ప్రాధాన్యత ఉంటుంది....? అనే చర్చ జరుగుతోంది. బీసీల్లో ఎక్కువ కులాలు ఉండటంతో  ఏ కులానికి ఎన్ని ఇస్తారనే చర్చ ఆసక్తికరంగా మారింది. ఇక జనరల్‌ కేటగిరి కింద మహిళలకు కేటాయించిన 15 స్థానాలు, జనరల్‌ కేగిరిలోని 12 స్థానాల్లో తమ వర్గాలకు ప్రాధాన్యతా క్రమంలో కేటాయింపులు జరపాలని బలమైన సామాజిక వర్గాలు డిమాండ్‌ చేస్తున్నట్టు సమాచారం. దాంతో అటు రూరల్‌, ఇటు సిటీ నియోజకవర్గాల్లోని నేతలు తలలు పట్టుకుంటున్నారు. 

మాకూ సీట్లు పెంచండి..

ఈ సారి తమకు సీట్ల కేటాయింపు పెంచాలన్న డిమాండ్‌ ముస్లిం మైనార్టీల నుంచి పెరుగుతోంది. 2014 ఎన్నికల్లో టీడీపీ  ముస్లింమైనార్టీలకు 4 సీట్లు కేటాయించగా అంటులో రూరల్‌ నియోజకవర్గంలో ఒకటి సిటీలో రెండు ఉన్నాయి. ఇక వైసీపీ 6 స్థానాలను  కేటాయించగా రూరల్లో 2, సిటీల్లో నాలుగు  ఉన్నాయి. ఈ సారి ముస్లింల ప్రాధాన్యత కలిగిన ప్రాంతాల్లో తమకే అవకాశాలివ్వాలని,  గతం కంటే ఎక్కువ సీట్లను కేటాయించాలని ఆ వర్గాల నుంచి రాజకీయ పార్టీలకు డిమాండ్లు ఉన్నాయి. దాంతో నేతలు ఆచితూచీ  ఆలోచిస్తూ అంగ, అర్ధ బలాలున్న వారిని తొలి జాబితాల్లోకి ఎక్కించి గెలుపోటములపై అధ్యయనం చేస్తున్నారు.

Updated Date - 2021-05-11T04:01:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising