పచ్చదనం.. పరిశుభ్రత వారి సొంతం!
ABN, First Publish Date - 2021-05-06T03:15:07+05:30
ఊడిన కిటికీలు.. భూజు పట్టిన గోడలు.. దుర్వాసన వెదజల్లె మరుగుదొడ్లు.. కానరాని మొక్కల జాడ.. ఇదీ ప్రభుత్వ కార్యాలయం అనగానే గుర్తుకొచ్చేది.
ఆకర్షణీయంగా కనుపూరు కాలువ సెక్షన్ కార్యాలయ ప్రాంగణం
అనేక రకాల మొక్కల పెంపకంలో ప్రత్యేక శ్రద్ధ
ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు
నెల్లూరురూరల్, మే 5: ఊడిన కిటికీలు.. భూజు పట్టిన గోడలు.. దుర్వాసన వెదజల్లె మరుగుదొడ్లు.. కానరాని మొక్కల జాడ.. ఇదీ ప్రభుత్వ కార్యాలయం అనగానే గుర్తుకొచ్చేది. కానీ ఇందుకు పూర్తి భిన్నంగా నెల్లూరు రూరల్ మండలంలోని కనుపూరు కాలువ సెక్షన్ (ఆమంచర్ల) కార్యాలయం అందరినీ ఆకర్షిస్తూ, పచ్చదనం, పరిశుభ్రత మా సొతం అంటుంది. నెల్లూరు-పొదలకూరు మార్గంలో ఆమంచర్ల వద్ద నిర్మించిన ఈ కార్యాలయంలోని ఆవరణం మొక్కల పెంపకం కేంద్రంగా తయారు చేశారు. ఇక్కడ జామ, మామిడి, సపోట, పనస, బత్తాయి, నిమ్మ, దానిమ్మ, సీతాఫలం మొక్కలతో పాటు కూరగాయల మొక్కలు పెంచడంతో చూపరులను ఆకట్టుకుంటున్నాయి. డ్రైఫ్రూట్స్‌లో వాడే అంజీర మొక్క ప్రత్యేక ఆకర్షిణీయంగా మారింది. కనుపూరు కాలువ నిర్మాణంలో సిమెంట్ బస్తాల గోదాములకు ఉపయోగించిన ఈ స్థలంలో నూతన కార్యాలయాన్ని నిర్మించుకున్న అధికారులు ఆ ప్రాంగణంలో ఈ మొక్కలు పెంచుతున్న ఏఈ బాలసుబ్రహ్మణ్యం ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటున్నారు. తమ శాఖకు జిల్లాకు వచ్చే ప్రతి నూతన అధికారితో ఇక్కడ ఓ మొక్క నాటించడం ఆనవాయితీగా వస్తుందని ఆయన పేర్కొన్నారు.
Updated Date - 2021-05-06T03:15:07+05:30 IST