ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమనీయం కలుగోళ్లశాంభవి అమ్మవారి ఉత్సవాలు

ABN, First Publish Date - 2021-01-16T05:16:28+05:30

కావలి గ్రామ దేవత కలుగోళ్ల శాంభవి అమ్మవారి ఉత్స వాలు పోలీస్‌ బందోబస్తు నడుమ ప్రశాం తంగా ముగిశాయి.

గ్రామోత్సవంలో అమ్మవారు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలి, జనవరి 15: కావలి గ్రామ దేవత కలుగోళ్ల శాంభవి అమ్మవారి ఉత్స వాలు పోలీస్‌ బందోబస్తు నడుమ ప్రశాం తంగా ముగిశాయి. గురువారం ఉదయం నుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకున్నా రు.  ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ మన్నెమాల సుకుమార్‌రెడ్డి లు రాత్రి అమ్మవారిని దర్శించుకుని సాం స్కృతిక కార్యక్రమాలను తిలకించారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కాటంరెడ్డి విష్ణువర్దన్‌రెడ్డి తన అనుచరులతో గురువా రం ఉదయం అమ్మవారిని దర్శించుకున్నా రు. డీఎస్పీ ప్రసాద్‌రావు, ఒకటో పట్టణ సీఐ శ్రీనివాసరావు సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. బుధవారం రాత్రి అమ్మవారు ఆల యం నుంచి గ్రామోత్సవానికి బయలుదేరి గురువారం సాయంత్రం వరకు పట్టణంలో ఊరేగి అమ్మవారి ఆలయానికి చేరుకుంది. అయితే గ్రామోత్సవం ప్రారంభమైన కొద్దిసే పటికి స్థానిక పెద్దపవని బస్టాండ్‌ సెంటర్‌ లో గొడవలకు పాల్పడటంతో లాఠీలకు పని చెప్పారు.

ఎట్టకేలకు సాంస్కృతిక కార్యక్రమాలు

ఈ ఏడాది కొవిడ్‌ దృష్ట్యా తొలుత సాంస్కృతిక కార్యక్రమాలకు అనుమతులు లేవని చెప్పారు. అయితే ముందురోజు అల్లూరులో పోలేరమ్మ ఉత్సవాలలో సాం స్కృతిక కార్యక్రమాలకు అనుమతులు ఇవ్వ డం చర్చనీయాంశమైంది. ఆ విషయం ఆంధ్రజ్యోతిలో ఒక నియోజకవర్గం.. రెండు పోలీస్‌చట్టాలు అన్న శీర్షికన కథనం ప్రచురి తమైంది. దాంతో ఎమ్మెల్యే పోలీస్‌ అధికారులను ఒప్పించడంతో కొనసాగాయి.

అమ్మవారికి పట్టు వస్త్రాలు 

కావలి రూరల్‌: కళుగోల శాంభవి అమ్మవారికి ఒకటో పట్టణ సీఐ శ్రీనివాసరా వు గురువారం పట్టు వస్త్రాలను సమర్పించారు. ఇక నుంచిప్రతి ఏడాది ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌ నుంచి అమ్మవారి ఉత్సవాలకు పట్టువస్త్రాలను అందించాలని నిర్ణయించారు.

Updated Date - 2021-01-16T05:16:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising