ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కబ్జా కోరల్లో ప్రభుత్వ స్థలాలు

ABN, First Publish Date - 2021-01-25T05:39:42+05:30

కావలికి కూతవేటు దూరం లో ముసునూరుకు పడమర వైపున నిరుపేదల కోసం సుమా రు 13ఏళ్ల క్రితం, ఇందిరమ్మ కాలనీ పేరుతో 6000మందికి నాలుగు లేఅవుట్లలో నివేశనా స్థలాలు కేటాయించారు.

రెండో నెంబరు లేఅవుట్‌లో స్థల ఆక్రమణకు తీసిన పునాదులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లేఅవుట్లలో కేటాయించని స్థలాలపై కన్ను

ఆక్రమణకు నకిలీ పట్టాల సృష్టి

గతంలో అడ్డుకున్నా ఆగిన వైనం

పట్టించుకోని పాలకులు, అధికారులు


కావలి రూరల్‌, జనవరి 24:  కావలికి కూతవేటు దూరం లో ముసునూరుకు పడమర వైపున నిరుపేదల కోసం సుమా రు 13ఏళ్ల క్రితం, ఇందిరమ్మ కాలనీ పేరుతో 6000మందికి  నాలుగు లేఅవుట్లలో నివేశనా స్థలాలు కేటాయించారు. లేఅవుట్లకు పోను మిగిలిన ప్రభుత్వ స్థలాలపై కబ్జాదారుల కన్ను పడింది. దీంతో కబ్జాదారులు ముఠాగా ఏర్పడి లేఅవుట్లలోని రోడ్డు పక్కనున్న క్రాస్‌బిట్లతోపాటు రోడ్లు, పార్కులకు వదిలిన స్థలాలకు నకిలీ పట్టాలు సృష్టించారు. అక్కడ అక్రమ కట్టడాలు నిర్మించి సొమ్ము చేసుకుంటున్నారు. ఆక్రమిక స్థలాల్లో యథేచ్ఛగా  కట్టడాలు కడుతున్నా అటు పాలకులు గానీ, ఇటు అధికారులు గానీ పట్టించుకోవటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


ఆక్రమణల్లో వందకిపైగా స్థలాలు

 కాలనీలోని 1, 2 లేఅవుట్లలో సుమారు 100కిపైగా  స్థలాలు ఆక్రమణదారుల చేతుల్లోకి వెళ్లాయని స్థానికులు పేర్కొన్నారు. కాలనీలోని రైల్వే ట్రాక్‌కు సమీపంలో ఉన్న మూడో నంబరు లేఅవుట్‌లో ట్రాక్‌కు కాలనీకి మధ్య పార్కు తదితర అవసరాల కోసం ప్రభుత్వం సుమారు రెండు ఎకరాల స్థలాన్ని రిజర్వులో ఉంచింది. ఆస్థలంపై కూడా కొందరు వ్యక్తులు కన్నేశారు. స్థానికులు దాన్ని ప్రభుత్వ స్థలంగా గుర్తించి ఆంధ్రజ్యోతి ప్రతినిధి దృష్టికి తీసుకువచ్చారు. ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనానికి స్పందనగా ఆ స్థలంలో ప్రభుత్వ భూమిగా బోర్డులు ఏర్పాటు చేశారు.


ఆపినా.. ఆగని కట్టడాలు

అట్టల ఫ్యాక్టరీ కాలనీలోని 4వ నెంబరు లేఅవుట్‌లో లే అవుట్‌లకు పోను రోడ్డు వెంబడి ఉన్న క్రాస్‌ బిట్‌తో పాటుగా రోడ్డు ఆక్రమించి అక్రమంగా ఇళ్లు కడుతున్నారని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రెవెన్యూ, పోలీస్‌ అధికారులు వచ్చి అక్రమ కట్టడాలను ఆపారు. కానీ నకిలీ పట్టాలతో మళ్లీ కట్టడాలు ప్రారంభిస్తున్నా పాలకులు, అధికారులు పట్టించుకోవడంలేదు.  ఇప్పటికైనా వారు స్పందించి  నకిలీ పట్టాలపై విచారణ చేపట్టాలని కాలనీ వాసులు కోరుతున్నారు.

Updated Date - 2021-01-25T05:39:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising