ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీవో సరే.. గైడ్‌ లైన్స ఎక్కడ ?

ABN, First Publish Date - 2021-05-17T04:57:25+05:30

ఆలయాలు, మసీదులు, చర్చిలలో పనిచేసే అర్చకులు, ఇమామ్‌, మౌజన్లు, పాస్టర్ల జీతాలు రెట్టింపు చేస్తూ కేబినెట్‌ నిర్ణయంపై జీవో విడుదలైంది సరే..

జీతాల పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జీతాల పెంపుపై స్పష్టత కరువు

అర్చకులు, మౌజన్లు, ఇమామ్‌లు, పాస్టర్లు 

4 వేల మందికి ప్రయోజనం


నెల్లూరు(సాంస్కృతికం), మే 16 : ఆలయాలు, మసీదులు, చర్చిలలో పనిచేసే అర్చకులు,  ఇమామ్‌, మౌజన్లు, పాస్టర్ల జీతాలు రెట్టింపు చేస్తూ కేబినెట్‌ నిర్ణయంపై జీవో విడుదలైంది సరే.. వీటిని ఎలా అమలు చేయాలో గైడ్‌లైన్స ఇప్పటి వరకు ఆయా శాఖలకు అందలేదు.  దీంతో జీతాల పెంపుపై స్పష్టత కరువైంది. ఇది పూర్తిస్థాయిలో అమలు జరిగితే జిల్లాలో అర్చకులు, మౌజన్లు, ఇమామ్‌లు, పాస్టర్లు 4 వేల మందికి ప్రయోజనం కలుగుతుంది. 

దేవదాయ ధర్మాదాయ శాఖలో 1,300 ఆలయాలున్నాయి. వివిధ కేటగిరిలలో 1,100 ఆలయాల్లో అర్చకులకు జీతాలు చెల్లిస్తున్నారు. ధూపదీప నైవేద్యం పథకం కింద 109 మంది అర్చకులు, 6ఏ ఆలయాలు మినహా 6బి కేటగిరిలో 500, 6సి కేటగిరిలో 300 మంది అర్చకులు పనిచేస్తున్నారు. ధార్మిక పరిషత ఆర్థిక సహాయంతో 40 ఆలయాల్లో 40 మంది అర్చకులున్నారు. ఇనస్పెక్టర్లు, ధర్మకర్తల ఆధ్వర్యంలో నడిచే ఆలయాల్లో 50 మంది అర్చకులు పని చేస్తున్నారు. జీతాలు పెంపుతో 1000 మంది అర్చకులకు లబ్ధి చేకూరుతుంది. కాగా ధార్మిక పరిషత సహాయం కింద పనిచేస్తున్న అర్చకులకు 6 నెలలుగా జీతాలు చెల్లించలేదు.  అలాగే ధూపదీప నైవేద్యం పథకం కింద అర్చకులకు 2 నెలలుగా జీతాలు అందలేదు. మంత్రివర్గం నిర్ణయం ప్రకారం పెరిగిన జీతాలు వస్తాయని వారిలో ఆనందం ఉన్నా జీవో విధివిధానాలు ఇంకా రాకపోవడంతో పెంచిన వేతనాలు, బకాయిలు చెల్లించడానికి ఎన్ని నెలలు పడుతుందోనని అర్చకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వక్ఫ్‌బోర్డు ఆధ్వర్యంలో ఆదాయం లేని మసీదుల్లో పనిచేస్తున్న ఇమామ్‌లు, మౌజన్లు 984 మందికి రూ.5 వేలు, 3వేలు చొప్పున మార్చి వరకు వేతనాలు చెల్లించారు. ప్రభుత్వ గైడ్‌లైన్సల ప్రకారం కొత్తగా దరఖాస్తు చేసుకున్న 45 మందికి జీతాల కోసం ప్రభుత్వానికి నివేదిక పంపారు. ప్రభుత్వం పెరిగిన జీతాలు మంజూరు చేస్తే 492 మంది ఇమామ్‌లకు రూ.10వేలు, 492 మౌజనలకు రూ.5 వేలు వంతున వస్తాయి. మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 1,500 మంది పాస్టర్లకు ఒనటైమ్‌ పేమెంట్‌ రూ.5 వేలు వంతున చెల్లించారు. కొత్త జీవో ప్రకారం పాస్టర్లు 1,500 మందికి నెలకు రూ.10వేలు చొప్పున వస్తాయి. జీతాల కోసం ఆనలైన దరఖాస్తులకు ప్రభుత్వం ఈనెల 11వ తేదీన తుది గడువు నిర్ణయించింది. కానీ ఇంకా ఆనలైనలో దరఖాస్తులు విడుదల చేయడం లేదు. అలాగే పాస్టర్‌ బీసీ సీ కేటగిరికి చెందినవాడై ఉండాలి. చర్చిలు సొసైటీ యాక్ట్‌లో రిజిస్టర్‌ చేసి ఆ చర్చిలకు ప్రభుత్వమే రిజిస్టరు చేయాలి. ఈ నిబంధనల మేరకు ఫాదర్లకు జీతాలు చెల్లిస్తారు. 







Updated Date - 2021-05-17T04:57:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising