ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గతుకుల దారి ఇలా.. గాయాలు అయ్యేలా!

ABN, First Publish Date - 2021-07-16T04:43:35+05:30

జిల్లాలో రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయి. కొన్ని రహదారులపై ప్రయాణమంటేనే ప్రజలు హడలిపోతున్నారు.

గూడూరు నుంచి జాతీయరహదారిని కలిసే పోటుపాళెం కూడలి ఇది. ఏడాది కాలంగా రోడ్డుపై రాళ్లు తేలి గుంతలమయంగా మారింది. ప్రమాదాలు జరగకుండా డ్రమ్ములు అడ్డుపెట్టిన అధికారులు మరమ్మతు చేయించడంలో శ్రద్ధ చూపడంలేదు.
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లాలో దారుణంగా దెబ్బతిన్న రహదారులు

గతేడాది ‘నివర్‌’ ధాటికి ఇప్పటికీ బాగుపడని రోడ్లు

ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా కాంట్రాక్టర్లలో గుబులు

ఇప్పటికే బిల్లుల పెండింగ్‌తో అయోమయం

మూడోసారి టెండర్ల ఆహ్వానానికి ఆర్‌అండ్‌బీ సన్నద్ధం

ప్రజలకు తప్పని అవస్థల ప్రయాణం 


అడుగడుగునా గుంతలు, కొన్నిచోట్ల పూర్తిగా దెబ్బతిన్న దారులు, ఇంకొన్ని చోట్ల రోడ్లే లేక అవస్థలు. ఆ వీధి రోడ్డు.. ఈ ఊరి రోడ్డు అన్న తేడా లేదు. ఒక్కసారి దెబ్బతిందంటే మళ్లీ బాగుపడడం కష్టమేనన్న రీతిలో జిల్లాలో రోడ్ల పరిస్థితి మారిపోయింది. ముఖ్యంగా ఆర్‌అండ్‌బీ శాఖలో దెబ్బతిన్న రోడ్లకు ప్యాచ వర్కులు వేయడంలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఒకవేళ వేసినా తూతూమంత్రంగా పనులు చేసి చేతులు దులుపుకుంటున్నారు. గతేడాది ‘నివర్‌’ ధాటికి దెబ్బతిన్న రోడ్లపై తట్టెడు మన్ను వేయలేకపోయారు. ఇప్పటికే బిల్లులు పెండింగ్‌ ఉండటం, మళ్లీ పనులు చేస్తే బిల్లులు వస్తాయో.. రావోనన్న అనుమానాలు కాంట్రాక్టర్లలో గూడుకట్టుకోవడంతో అధికారులు టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రావడం లేదు. ఇంకేముంది... గతుకుల రోడ్లపై ప్రజలకు అవస్థల ప్రయాణం తప్పలేదు.



నెల్లూరు, జూలై 15 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయి. కొన్ని రహదారులపై ప్రయాణమంటేనే ప్రజలు హడలిపోతున్నారు. గడిచిన రెండేళ్ల నుంచి ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో రోడ్ల అభివృద్ధి కుంటుపడింది. కొత్త రోడ్ల సంగతి అటుంచితే దెబ్బతిన్న రోడ్లను కూడా బాగు చేయలేకపోతున్నారు. ఆర్‌అండ్‌బీ శాఖలో ప్యాచ వర్కులు చేసిన కాంట్రాక్టర్లకు రెండేళ్లుగా బిల్లులు అందలేదు. దీంతో కొత్తగా పనులు చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ముఖ్యంగా గతేడాది నివర్‌ తుఫాన దెబ్బకు అప్పటికే అంతంత మాత్రంగా ఉన్న రోడ్లు తర్వాత పూర్తిగా దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న రోడ్ల వివరాలను జిల్లా  అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఈ క్రమంలో 46 ప్రధాన రోడ్ల మరమ్మతులకు రూ.88.28 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలనా అనుమతులు జారీ చేసింది. అదేవిధంగా బాగా దెబ్బతిన్న రాష్ట్ర రహదారుల అభివృద్ధికీ నిధులు మంజూరు చేసింది. త్వరగా ఈ రోడ్లను బాగు చేయాలని ప్రభుత్వం ఆదేశించినా క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. ఇప్పటికే బిల్లులు పెండింగ్‌ ఉండటం, తాజాగా పనులు చేస్తే మళ్లీ బిల్లులు వస్తాయో.. రావోనన్న అనుమనాలు కాంట్రాక్టర్లలో  ఉండటంతో టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో ఆ రోడ్లపై ప్రయాణించే ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. 


32 రోడ్లు.. రూ.162 కోట్లు..


గతేడాది నివర్‌ తుఫాన దెబ్బకు జిల్లాలోని ప్రధాన రోడ్లు భాగా దెబ్బతిన్నాయి. వీటిని బాగుచేయాలని జిల్లా అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. పలు రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం పరిపాలనా అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లాలో దెబ్బతిన్న మేజర్‌ డిసి్ట్రక్ట్‌ రోడ్లు (ఎండీఆర్‌), రాష్ట్ర రహదారులను అభివృద్ధి చేసేందుకు ఏప్రిల్‌ నెలలో ఆర్‌అండ్‌బీ అధికారులు టెండర్లు పిలిచారు. 21 ఎండీఆర్‌ రోడ్లకు రూ.87 కోట్లతో, 11 రాష్ట్ర రహదారులకు రూ.75 కోట్లతో టెండర్లు పిలిచారు. ఏప్రిల్‌లో మొదటి కాల్‌ టెండర్లు పిలిచినా ఎవరూ టెండర్లు వేయలేదు. దీంతో  మే నెలలో మరోసారి టెండర్ల దాఖలుకు ఆహ్వానించారు. ఆ నెల 17వ తేదీతో గడువు ముగిసినప్పటికీ కాంట్రాక్టర్లు ఆసక్తి కనబరచక పోవడంతో గడువును నెలాఖరు వరకు పొడగించారు. అయినా ఒక్క కాంట్రాక్టర్‌ కూడా పనులు చేసేందుకు ముందుకు రాలేదు. దీంతో ఇప్పుడు మూడో కాల్‌ టెండర్లు పిలిచారు. బ్యాంకు రుణం ద్వారా ఈ వర్కులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. అయితే రుణం మంజూరు కాలేదని, తర్వాత ఎలా బిల్లులు చెల్లిస్తారన్నదానిపై స్పష్టత లేదని కాంట్రాక్టర్ల వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే బిల్లుల చెల్లింపులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, మరోసారి అనిశ్చిత పరిస్థితుల్లో పనులు చేస్తే ఇబ్బందులు రెట్టింపవుతాయని కాంట్రాక్టర్లు అంటున్నారు. కాగా ఇటువంటి పరిస్థితులు ఎప్పుడూ ఎదురుకాకపోవడంతో అధికారులు కూడా తల పట్టుకుంటున్నారు. సకాలంలో టెండర్లు పూర్తికాకపోతే వర్షాకాలంలోపు కొంత వరకైనా పనులు పూర్తి చేయడం కష్టమవుతుందని ఆందోళన చెందుతున్నారు. 



Updated Date - 2021-07-16T04:43:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising