ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముందే హెచ్చరించినా పట్టించుకోలేదు

ABN, First Publish Date - 2021-11-30T05:01:13+05:30

పెన్నా పొర్లుకట్టకు మినగల్లు- పెసుబల్లి మధ్య నాలుగు భారీ గండ్లు పడే అవకాశం ఉందని రాష్ట్ర ఇరిగేషన్‌ శాఖ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌, కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్‌రెడ్డి, అధికారులకు ముందుగానే తెలిపినా నివారణ చర్యలు తీసుకోకపోవడంతో నెల్లూరు, బుచ్చిరెడ్డిపాలెం ప్రాంతాల్లో భారీ నష్టం వాటిల్లిందని సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌ వెల్లడించారు.

మాట్లాడుతున్న సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 వరద నష్టం రూ. 1190 కోట్లని అధికారుల అంచనా

ఇంకా చాలా ఎక్కువే ఉంటుంది 

 సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌

నెల్లూరు (వైద్యం) నవంబరు 29 : పెన్నా పొర్లుకట్టకు మినగల్లు- పెసుబల్లి మధ్య నాలుగు భారీ గండ్లు పడే అవకాశం ఉందని  రాష్ట్ర ఇరిగేషన్‌ శాఖ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌, కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్‌రెడ్డి, అధికారులకు ముందుగానే తెలిపినా నివారణ చర్యలు తీసుకోకపోవడంతో నెల్లూరు, బుచ్చిరెడ్డిపాలెం ప్రాంతాల్లో  భారీ నష్టం వాటిల్లిందని సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌ వెల్లడించారు. నెల్లూరులోని సీపీఎం జిల్లా కార్యాలయంలో సోమవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. .ఇప్పటికైనా పడిన గండ్లు పూడ్చక పోతే మరో 4 రోజులలో కొనసాగే వర్షాలకు తీవ్ర ముప్పు ఏర్పడనున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.  వరదలు, వర్షాల వల్ల రూ. 1190 కోట్ల నష్టం ఉండవచ్చని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారన్నారు. ఇది ఇంకా ఎక్కువే ఉంటుందని చెప్పారు. వరద నష్టాన్ని రికార్డు చేయాలన్నారు.  ఇళ్లలోకి నీరు వచ్చి నష్ట పోయిన వారికి రూ. 2వేలు ఏమాత్రం సరిపోవని, కనీసం రూ. 20వేలు ఇవ్వాలని కోరారు. వేలాది ఎకరాల్లో దెబ్బతిన్న చేపలు, రొయ్య గుంటల రైతులకు ఎకరాకు రూ. లక్ష ఇవ్వాలన్నారు. వరినాట్లు, మినుము, బొప్పాయి, పసుపు, శనగ పంటలకు ఎకరాకు రూ. 10 వేలు ఇవ్వాలని కోరారు. మేట వేసిన భూములకు రూ. లక్ష నష్టపరిహారం చెల్లించాలన్నారు.  సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు చండ్ర రాజగోపాల్‌, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మోహన్‌రావు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-30T05:01:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising