ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిల్లకూరు మండల తొలి సర్వసభ్య సమావేశం

ABN, First Publish Date - 2021-10-19T03:37:51+05:30

స్థానిక మండల కార్యాలయంలో సోమవారం ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు బాధ్యతలు చేపట్టిన తరువాత తొలి సర్వసభ సమావేశం నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిల్లకూరు, అక్టోబరు 18: స్థానిక మండల కార్యాలయంలో సోమవారం ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు బాధ్యతలు చేపట్టిన తరువాత తొలి సర్వసభ సమావేశం నిర్వహించారు. ముందుగా ఆయా శాఖల అధికారులు వారి పరిధిలో జరిగే పనుల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ సభ్యుడు మన్నెం శీనయ్య మాట్లాడుతూ  సమస్యల పరిష్కారం నిమిత్తం రెవెన్యూ కార్యాలయానికి వచ్చే పేదప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. సమస్యలను పరిష్కరించకపోవడంతో పలువురు సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారన్నారు. చిల్లకూరు పీఏసీఎస్‌ అధ్యక్షుడు చేవూరు నాగరాజు మాట్లాడుతూ గ్రామాలలో విద్యుత్‌సమస్యలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ప్రధానంగా విద్యుత్‌ తీగలు, స్తంభాలు ప్రమాదకరంగా ఉన్నాయన్నారు. విద్యుత్‌ అఽధికారులు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసరావు, ఎంపీపీ తుపాకుల వెంకటరమణమ్మ, వైస్‌ఎంపీపీ వేమారెడ్డి కుమారస్వామిరెడ్డి, పీఏసీఎస్‌ అధ్యక్షుడు చేవూరు నాగరాజు, పలు శాఖ అధికారులు, ప్రజాప్రనిధులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-19T03:37:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising