ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధ్యాయ సమస్యలు వెంటనే పరిష్కరించాలి

ABN, First Publish Date - 2021-07-24T07:20:32+05:30

పాధ్యాయుల సమస్యలైన పీఆర్సీ, డీఏలు, సీసీఎస్‌ రద్దు తదితరాలను వెంటనే పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య నాయకులు డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) పిలుపు మేరకు శుక్రవారం ఉదయం నెల్లూరు నగర తహసీల్దారు కార్యాలయం ముందు ధర్నా చేశారు.

నెల్లూరు నగర తహసీల్దారు కార్యలయం ముందు ధర్నా చేస్తున్న ఉపాధ్యాయ సంఘూల నేతలు.
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫ్యాఫ్టో ధర్నా

నెల్లూరు (వెంకటేశ్వరపురం), జూలై 23 : ఉపాధ్యాయుల సమస్యలైన పీఆర్సీ, డీఏలు, సీసీఎస్‌ రద్దు తదితరాలను వెంటనే పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య నాయకులు డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) పిలుపు మేరకు శుక్రవారం ఉదయం నెల్లూరు నగర తహసీల్దారు కార్యాలయం ముందు ధర్నా చేశారు. నాయకులు రాజమనోహర్‌, అబ్బయ్య  మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఇంత వరకు పీఆర్సీ అమలు చేయలేదన్నారు. దాదాపు ఆరు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు సీసీఎస్‌ రద్దు చేసి పాత పింఛను విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యాశాఖలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. కరోనాతో మృతి చెందిన ఉపాధ్యాయుల కుటుంబ సభ్యులకు వెంటనే కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు దశరఽథరామయ్య, చెంచురామయ్య, రమణయ్య, పెంచలరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-24T07:20:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising