ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్యాంకుల్లో భద్రత బాధ్యత బ్యాంకర్లదే!

ABN, First Publish Date - 2021-10-19T04:56:42+05:30

బ్యాంకుల్లో భద్రత బాధ్యత బ్యాంకర్లదేనని నెల్లూరు నగర డీఎస్పీ జే శ్రీనివాసులురెడ్డి బ్యాంకు అధికారులకు స్పష్టం చేశారు. నగరంలోని ఓ హోటల్‌లో సోమవారం బ్యాంకు అధికారులతో డీఎస్పీ సమావేశం నిర్వహించారు.

అవగాహన కల్పిస్తున్న డీఎస్పీ శ్రీనివాసులురెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏటీఎంల వద్ద సెక్యూరిటీ గార్డులు తప్పనిసరి

నగర డీఎస్పీ శ్రీనివాసులు రెడ్డి

నెల్లూరు(క్రైం), అక్టోబరు 18: బ్యాంకుల్లో భద్రత బాధ్యత బ్యాంకర్లదేనని నెల్లూరు నగర డీఎస్పీ జే శ్రీనివాసులురెడ్డి బ్యాంకు అధికారులకు స్పష్టం చేశారు. నగరంలోని ఓ హోటల్‌లో సోమవారం బ్యాంకు అధికారులతో డీఎస్పీ సమావేశం నిర్వహించారు. ఏటీఎంల వద్ద భద్రత సిబ్బంది లేని కారణంగా వృద్ధులు, మహిళలను మాయగాళ్లు సాయం పేరుతో మోసం చేస్తున్నారని, ఏటీఎం కేంద్రాల వద్ద సెక్యూరిటీ గార్డులు ఉంటే ఈ మోసాలు జరిగేందుకు ఆస్కారం ఉండదన్నారు. బ్యాంకులు, ఏటీఎం సెంటర్లలోని సీసీ కెమెరాలను పోలీసు కమాండ్‌ కంట్రోల్‌కు అనుసంధానం చేయాలని సూచించారు. బ్యాంకుల్లోని సెక్యూరిటీ సిబ్బందిని ఇతర పనులకు వినియోగించకుండా భద్రత కోసమే ఉపయోగించాలని, అనుమానస్పద వ్యక్తులను గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించేలా బ్యాంకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. బ్యాంకు ఉద్యోగులమంటూ పలువురు సైబర్‌ నేరగాళ్లు ప్రజల బ్యాంకు ఖాతాల వివరాలను తెలుసుకుని నగదు దోచుకుంటున్నారన్నారు. ఈ నేపథ్యంలో ఖాతాదారులకు అవగాహన కల్పించే విధంగా రూపొందించిన పోస్టర్లను బ్యాంకుల వద్ద, ఏటీఎం కేంద్రాల వద్ద ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్లు టీవీ సుబ్బారావు, షేక్‌ అన్వర్‌బాషా, కే నరసింహరావు, జీ మంగారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-19T04:56:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising