ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికల్లో వలంటీర్లను పక్కన పెట్టండి

ABN, First Publish Date - 2021-10-23T04:56:53+05:30

బుచ్చి నగర పంచాయతీ ఎన్నికల్లో వలంటీర్లను పక్కన పెట్టాలని ప్రతిపక్ష పార్టీ నాయకులు కమిషనర్‌ను డిమాండ్‌ చేశారు.

మున్సిపల్‌ కార్యాలయం బయట మాట్లాడుతున్న ప్రతిపక్ష నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రతిపక్ష నేతల డిమాండ్‌

బుచ్చిరెడ్డిపాళెం, అక్టోబరు 22: బుచ్చి నగర పంచాయతీ ఎన్నికల్లో వలంటీర్లను పక్కన పెట్టాలని  ప్రతిపక్ష పార్టీ నాయకులు కమిషనర్‌ను డిమాండ్‌ చేశారు. స్థానిక నగర పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం పోలింగ్‌ స్టేషన్లు, ఓటరు జాబితాల అభ్యంతరాలపై అఖిలపక్ష నాయకులతో కమిషనర్‌ సమావేశం నిర్వహించారు. వైసీపీ, టీడీపీ, బీజేపీ   తదితర పార్టీల నాయకులు పాల్గొన్నారు. ప్రతి వార్డులో ముగ్గురు ఎన్నికల అధికారుల బృందంతోపాటు కమిషనర్‌ ఎన్నికల పర్యవేక్షణాధికారిగా ఉంటారని కమిషనర్‌ తెలిపారు.  బీజేపీ, టీడీపీ నాయకులు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో వలంటీర్లు ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారన్నారు. సంక్షేమ పథకాలు తొలగిస్తామని ఓటర్లను భయపెట్టి అధికారపార్టీకి ఓట్లు వేయించారని విమర్శించారు. నోటిఫికేషన్‌ విడుదలైన వెంటనే ఓటర్లను బెదిరించడం, ఓట్లు అడగడం లాంటి చర్యలపై ప్రజలు ఫిర్యాదు చేస్తే వలంటీర్లపైన క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని అధికారులు ప్రచారం చేయాలన్నారు. వలంటీర్ల ప్రభావంతో ఒక వార్డులో ఉండాల్సిన ఓటర్ల పేర్లు మరో వార్డులో ఉన్నాయన్నారు. వాటిని సరిచేసి జాబితాలు తయారు చేస్తే తప్ప ఎన్నికలు పారద్శకంగా జరగవన్నారు. లేదంటే ఎదురయ్యే ఎలాంటి ఘర్షణలకైనా అధికారులే భాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. సమావేశంలో వైసీపీ నాయకుడు ఇన్నమూరి నరసింహరావు, టీడీపీ నాయకులు ఎంవీ. శేషయ్య, బత్తల హరికృష్ణ, కావలి వెంకటేశ్వర్లు, నెల్లూరు ప్రభాకర్‌రెడ్డి, దుగ్గిశెట్టి హరనాథ్‌, బీజేపీ నాయకులు కాసా శ్రీనివాసులు, గంజం పెంచల ప్రసాద్‌, రత్న ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-23T04:56:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising