ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దళారులను నమ్మి మోసపోవద్దు

ABN, First Publish Date - 2021-03-03T04:08:32+05:30

దళారుల చేతిలో మోసపోకుండా రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని సివిల్‌ సఫ్లైయ్స్‌ జిల్లా మేనేజర్‌ రోజ్‌మాండ్‌ సూచించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రంలో రికార్డులు తనిఖీ చేస్తున్న సివిల్‌ సఫ్లైయ్‌ డీఎం రోజ్‌మాండ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర

సివిల్‌ సఫ్లైయ్స్‌ జిల్లా మేనేజర్‌ రోజ్‌మాండ్‌

సంగం, మార్చి 2: దళారుల చేతిలో మోసపోకుండా రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని సివిల్‌ సఫ్లైయ్స్‌ జిల్లా మేనేజర్‌ రోజ్‌మాండ్‌ సూచించారు. మంగళవారం ఆమె సంగంలోని రైతు భరోసా కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో సుమారు 5.3 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారన్నారు. 16 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా ఉందన్నారు. రైతులకు మద్దతు ధర కల్పించేందుకు జిల్లాలో 214 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 4 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇప్పటి వరకు 187 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామన్నారు. 38 కేంద్రాల ద్వారా 9,737 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. జిల్లాలో 150 మిల్లుల నుంచి సుమారు రూ.50 కోట్లకు, కడప, ప్రకాశం, గుంటూరు జిల్లాల మిల్లుల నుంచి కూడా బ్యాంక్‌ గ్యారెంటీ తీసుకుని ధాన్యం తరలిస్తున్నామన్నారు. రైతులు వరికోతకు వారం రోజుల ముందు ఈ క్రాప్‌ తప్పని సరిగా నమోదు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట పౌర సరఫరాలు, ధాన్యం కొనుగోలు కేంద్రం సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2021-03-03T04:08:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising