ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనవసర ప్రశ్నలు వేయొద్దు

ABN, First Publish Date - 2021-07-26T05:29:33+05:30

దిశ యాప్‌ను ఆశ్రయించిన బాధితులను అనవసర ప్రశ్నలు వేయవద్దని పోలీసులకు గుంటూరు రేంజ్‌ డీఐజీ డాక్టర్‌ త్రివిక్రమ్‌వర్మ సూచించారు. ప్రతి మహిళ మొబైల్‌లో దిశ యాప్‌ తప్పక ఉండాలని, ఆయాప్‌పై అందరికీ అవగాహన కల్పించాలని ఆదేశించారు.

మాట్లాడుతున్న డీఐజీ త్రివిక్రమ్‌వర్మ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రతి మహిళ మొబైల్‌లో దిశ యాప్‌ ఉండాలి

డీఐజీ త్రివిక్రమ్‌ వర్మ

నెల్లూరు(క్రైం), జూలై 25: దిశ యాప్‌ను ఆశ్రయించిన బాధితులను అనవసర ప్రశ్నలు వేయవద్దని పోలీసులకు గుంటూరు రేంజ్‌ డీఐజీ డాక్టర్‌ త్రివిక్రమ్‌వర్మ సూచించారు. ప్రతి మహిళ మొబైల్‌లో దిశ యాప్‌ తప్పక ఉండాలని, ఆయాప్‌పై అందరికీ అవగాహన కల్పించాలని ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం ఎప్పీ సీహెచ్‌ విజయరావు, సబ్‌డివిజన్‌ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థినులకు దిశ యాప్‌పై అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు. పోలీసు అధికారులు, రెవెన్యూ, ఇతర శాఖల అధికారుల సమన్వయంతో ఈ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లాలోని పెండింగ్‌ కేసుల దర్యాప్తును త్వరగా పూర్తి చేయాలని, ముఖ్యంగా ఫోక్సో కేసుల్లో  జాప్యం లేకుండా చూడాలని, వారం లోపు చార్జ్‌షీట్‌ ఫైల్‌ చేయాలని ఆదేశించారు. 

Updated Date - 2021-07-26T05:29:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising