ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం కొనేవారేరి!?

ABN, First Publish Date - 2021-05-06T05:22:17+05:30

ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు అన్నదాతలు పడరానిపాట్లు పడుతున్నారు.

ధాన్యం ఎప్పుడు కొంటారయ్యా..? ప్రశ్నిస్తున్న రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మనుబోలు, మే 5 : ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు అన్నదాతలు పడరానిపాట్లు పడుతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో నిబంధనల కొర్రీతో విసుగుపోయిన రైతులు దళారులకు అమ్ముకుందామనుకున్నా వారూ ముందుకు రావడంతో లేదు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచక అవస్థలు పడుతున్నారు. బుధవారం మనుబోలులో రాసులుగా పోసిన ధాన్యం ముందు కొందరు కర్షకులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పది రోజులుగా వందలాది పుట్ల ధాన్యాన్ని ఆరబెట్టుకుంటూ కొనేవారు కోసం ఎదురుచూస్తున్నట్లు ఆవేదన చెందారు. సాగునీరు చాలక, మోటార్లకు విద్యుత్‌ సరఫరా లేక, సకాలంలో విత్తనాలు దొరక్క, తెగుళ్ల వల్ల గతంలో వరిసాగు చేయాలంటే అష్టకష్టాలు పడేవారమని పేర్కొన్నారు. ప్రస్తుతం అవన్నీ దాటుకుని పండించిన ధాన్యం అమ్ముకోలేక దిక్కుతోచని స్థితిలో ఉన్నామని తెలిపారు. ప్రభుత్వం కొనుగోలు  కేంద్రాల్లో ధాన్యానికి తేమశాతం ఒకటైతే, మిల్లుల వద్ద మరోమారు తేమశాతం ఇంకోలా చూపి పుట్టికి 1060 కేజీలు ఇవ్వాలని అడుగుతున్నారని వాపోయారు. అందువల్ల వారికి ధాన్యం ఇచ్చేందుకు ఇష్టపడటం లేదన్నారు. ప్రభుత్వమే భరోసా ఇచ్చి మద్దతుధరకు 860కేజీలు లెక్కన ధాన్యం తీసుకుని ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. 

Updated Date - 2021-05-06T05:22:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising